Begin typing your search above and press return to search.

చైనాకు మరో షాక్ ఇవ్వడానికి రెడీ అయిన మోడీ

By:  Tupaki Desk   |   10 Aug 2022 9:35 AM GMT
చైనాకు మరో షాక్ ఇవ్వడానికి రెడీ అయిన మోడీ
X
సరిహద్దుల్లో కుట్రలు చేస్తూ.. పైకి చెలిమి అంటూ మాయమాటలు చెబుతున్న చైనాకు గట్టి షాక్ ఇవ్వడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ రెడీ అయ్యింది. ఇప్పటికే చైనీస్ యాప్స్ ను దేశంలో బ్యాన్ చేసిన మోడీ అయినా ఆగని చైనా ఆగడాలకు చెక్ పెట్టడానికి రెడీ అయ్యారు. ఈ సారి దేశంలో విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తూ మన సంపదను అక్రమంగా చైనా తరలిస్తున్న చైనా మొబైల్ కంపెనీలపై కొరఢా ఝలిపించాలని మోడీ సర్కార్ రెడీ అయ్యింది.

ముఖ్యంగా చీప్ ఫోన్ల పేరుతో రూ.12వేల లోపు స్మార్ట్ మొబైల్ ఫోన్ల అమ్మకాల్లో చైనా కంపెనీలదే హవా.. షావోమీ, ఒప్పో, రెడ్ మీ కంపెనీలన్నీ చైనావే. వీటిదే 80శాతం మార్కెట్. అందుకే వీటిని నియంత్రించి భారతీయ మొబైల్ కంపెనీలను రక్షించడం.. చైనాను చావుదెబ్బతీయడమే లక్ష్యంగా మోడీ సర్కార్ అడుగులు వేస్తోందని సమాచారం.

సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువున్న చైనాకు మరోసారి భారత్ గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే చైనాకు చెందిన 59 చైనా యాప్స్ ను దేశంలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి డ్రాగన్ దేశానికి షాక్ ఇచ్చింది. ఈసారి చైనా మొబైల్ కంపెనీల చీప్ ఫోన్లపై నిషేధం విధించాలని యోచిస్తున్నట్టు సమచారం.

చైనా ఫోన్ల ధాటికి దేశంలో ఇండియా కంపెనీలైన లావా, మైక్రోమాక్స్ కంపెనీల వ్యాపారం బాగా దెబ్బతిన్నది. చైనా కంపెనీలు రాకముందు వీటి వ్యాపారం బాగా సాగేది. కానీ ఎప్పుడైతే చీప్ ఫోన్ల పేరుతో చైనా కంపెనీలు వచ్చిపడ్డాయో ఇండియా కంపెనీలు పూర్తిగా కనుమరుగయ్యాయి.

ఈ విషయాలన్నీ గమనించిన కేంద్రంలోని మోడీ సర్కార్ ఇప్పుడు స్వదేశీ కంపెనీలకు ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంతోనే చైనా కంపెనీలపై నిషేధం విధించాలని ఆలోచిస్తున్నది. ఒకవేళ కేంద్రం గనుక చైనా కంపెనీలపై బ్యాన్ విధిస్తే షావోమీ, రెడ్ మీ, ఒప్పో కంపెనీలు దాదాపు మూసుకోవాల్సిందే. రూ.12వేలకు పైగా ధరలున్న మొబైల్ ఫోన్లను మాత్రమే ఇండియాలో అమ్ముకోవచ్చు.

ఇప్పటికే ఇండియాలో ఖరీదైన ఫోన్లు అమ్ముతున్న ఆపిల్, వన్ ప్లస్, శాంసంగ్ లాంటి ఫోన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చైనా ఫోన్లకే భారీ దెబ్బ. చైనాకు చెందిన రకరకాల 300 యాప్స్ ను కేంద్రం బ్యాన్ చేసింది. దీనివల్ల డ్రాగన్ కు ఆదాయం బాగా తగ్గిపోయింది. ఇప్పుడు మొబైల్ ఫోన్ల కంపెనీలను కూడా నిషేధిస్తే మరింత దెబ్బపడడం ఖాయం. ఇప్పటికే రెండు చైనా కంపెనీలు పెద్ద ఎత్తున ఆదాయంపై పన్నులు కట్టకుండా చైనాకు తరలిస్తున్నట్టు నిర్ధారణైంది. ఇప్పుడు ఏకంగా కంపెనీలనే బ్యాన్ చేస్తే కనీసం స్వదేశీ కంపెనీలకు కాస్త ప్రోత్సాహమిచ్చినట్లవుతుంది.