Begin typing your search above and press return to search.

మోడీదే గుజ‌రాత్ విజ‌యం..!

By:  Tupaki Desk   |   8 Dec 2022 10:30 AM GMT
మోడీదే గుజ‌రాత్ విజ‌యం..!
X
గుజ‌రాత్ లో మ‌రోసారి బీజేపీ విజ‌యం ద‌క్కించుకుంది. వ‌రుస‌గా అధికార పీఠాన్ని కైవ‌సం చేసుకుంది. ఈ నెల 1, 5న జ‌రిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 182 స్థానాల‌కు గాను ఏకంగా.. 136 స్థానాల్లో బీజేపీ విజ‌యం ద‌క్కించుకుంది.

అయితే.. ఇది బీజేపీ విజ‌య‌మా? లేక‌.. అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విజ‌య‌మా? అంటే.. ఖ‌చ్చితంగా మోడీదే విజ‌య‌మ‌ని చెప్పాలి.

ఎందుకంటే బీజేపీ ప్రచారం ప్రారంభం అయిన త‌ర్వాత‌.. చాలా రోజులు ప్ర‌ధాని అసలు గుజ‌రాత్‌లో ఏం జరుగుతోంద‌నేది ప‌రిశీలించి ఒక ప్లాన్ త‌యారు చేసుకున్నారు. ప్ర‌చారంలో ఊపు ఉన్నా.. ప్ర‌జ‌ల్లో ఎక్క‌డో ఏదో అసంతృప్తి క‌నిపించింది.

వ‌రుస‌గా ఉన్న ప్ర‌భుత్వం పై స‌హ‌జంగానే ఉండే వ్య‌తిరేక‌త, ఎమ్మెల్యేల ప‌నితీరు వంటివి కూడా.. బీజేపీ ప్ర‌చారాల‌కు ప్ర‌జ‌ల‌ను దూరం చేసింది.

ఇలాంటి స‌మ‌యంలో మోడీ అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ధానిగా ఉన్న షెడ్యూళ్ల‌ను చాలా వ‌ర‌కు కుదించేసుకున్నారు. అత్యంత ముఖ్య‌మైన‌వి అయితే.. త‌ప్ప ఆయ‌న ఆయా కార్య‌క్ర‌మాల‌కు వెళ్ల‌లేదు. అంటే.. మొత్తం ఫోక‌స్ అంతా కూడా.. గుజ‌రాత్‌ పైనే మ‌ళ్లించారు. దాదాపు 30 స‌భ‌లు, 100 రోడ్ షోల‌లో ప్ర‌ధాని పాల్గొన్నారు. ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా ప్ర‌సంగాల‌ను దంచికొట్టారు.

అంతేకాదు.. "న‌న్ను చూడండి.. నాపై న‌మ్మ‌కం ఉంచండి.. మోడీ మీవాడు.. మీ బిడ్డ‌.. ఈ గుజ‌రాత్‌ను నేనే త‌యారుచేశా. బీజేపిని గెలిపించండి" అంటూ.. మోడీ చేసిన ప్ర‌చారం స‌క్సెస్ అయింది. ఆయ‌న అడుగు పెట్టిన చోట వేలాది ఓట్ల మెజారిటీ వ‌స్తే.. ఆయ‌న దూరంగా ఉన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ విజ‌యం సాధించింది. ఎలా చూసుకున్నా.. గుజ‌రాత్‌... బీజేపీదే అయినా.. ఇది మోడీ గెలుపు.. అనే టాక్ వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.