Begin typing your search above and press return to search.
ముగిసిన మోడీ-జగన్ చర్చలు.. ఏం చర్చించారు.?
By: Tupaki Desk | 5 April 2022 11:55 PM GMTప్రధాని మోడీతో ముగిసిన సీఎం జగన్ భేటీ అయ్యారు. మోడీతో గంటకు పైగా ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. జగన్ ఢిల్లీ పర్యటన ఆద్యంతం ఆసక్తిని రేపుతున్న వేళ.. ప్రస్తుతం గంటకు పైగానే మోడీ అప్పాయింట్‌మెంట్ ఇవ్వడం.. చర్చించడం.. ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో అసలు వారిరువురు.. ఏం చర్చించారనే అంశాలపై ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం.. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని, జగన్ చర్చించినట్టు తెలిసింది. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ ప్రధానికి వివరించినట్లు సమాచారం.
పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, రెవెన్యూ లోటు, తెలంగాణ నుంచి రావాల్సిన నిధులపై భేటీలో చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ఇటీవల కాలంలో బ్యాంకుల విషయంలో హద్దు మీరి అప్పులు ఇస్తున్న వైనంపై సీబీఐని పరిశీలన చేయాలంటూ కేంద్రం ఆదేవించింది. ఈనేపథ్యంలో ఈ అంశం కూడా.. ప్రధానితో చర్చించినట్టు తెలిసింది. మరీ ముఖ్యంగా త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికలు, సీట్ల భర్తీపై కేంద్ర పెద్దలతో జగన్ చర్చించినట్టు సమాచారం. ఎందుకంటే.. మొత్తం వైసీపీకి దఖలు పడే నాలుగు సీట్లలో ఒకదానిని మళ్లీ బీజేపీ మద్దతు దారులకే కేటాయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని సూచనలను సీఎం జగన్ తీసుకున్నట్టు తెలిసింది.
మోడీతో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు. కాసేపట్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ను.., రాత్రి 9.30 గంటలకు హోం మంత్రి అమిత్ షాను సీఎం జగన్ కలవనున్నారు. విభజన హామీల అమలు, ఇతర సమస్యల పరిష్కారంపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చిస్తారని సమాచారం. ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి... రేపు ఉదయం మరికొందరు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధానికి సీఎం జగన్ ఒక నివేదిక అందించారు. దీనిలోని కీలక అంశాలు
- గత ప్రభుత్వం హయాంలో అదనపు రుణాలకు అనుమతిచ్చారు. ఇప్పుడు ఆ అదనపు రుణాలకు సరిపడా... రాష్ట్ర రుణపరిమితుల్లో కోత విధిస్తామని అంటున్నారు. దీనివల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుంది. విధించిన రుణ పరిమితిని మించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ రుణాలు తీసుకురాలేదు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రుణాల పరిమితిని సవరించాల్సిందిగా కోరుతున్నాం.
- తెలంగాణ డిస్కంలు రూ.6,455.76 కోట్ల రూపాయలను ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రాన్ని విభజించిన నాటినుంచీ జూన్ 2017 వరకూ తెలంగాణ డిస్కంలకు చేసిన విద్యుత్ పంపిణీకి సంబంధించి ఈమొత్తాన్ని ఇవ్వాల్సి ఉంది. ఈ డబ్బును ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. ఈమేరకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాం. తీవ్ర రుణభారాన్ని ఎదుర్కొంటున్న ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు తమ ఆర్థిక నిర్వహణకోసం ఈ డబ్బు చాలా అవసరం.
- పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరుతున్నాను. 2019, ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ. 55, 548.87 కోట్లుగా నిర్ధారించింది. ఈ అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఇంకా రూ.31,188 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరాన్ని మీ ముందుకు తెస్తున్నాను. ఇందులో నిర్మాణ పనులకోసం రూ.8,590 కోట్లు, భూ సేకరణ - పునరావాసంకోసం రూ.22,598 కోట్లు ఖర్చవుతుంది.
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ వైజ్‌గా బిల్లుల చెల్లింపును సవరించాలని కోరుతున్నాం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు, కేంద్ర చెల్లిస్తున్న బిల్లులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. ఈ ఆంక్షల వల్ల రూ.905 కోట్ల బిల్లులను కూడా పోలవరం ప్రాజెక్ట్అథారిటీ తిరస్కరించింది. కాంపొనెంట్‌వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టులో జరిగే పనులను ³రిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాను. అంతేకాకుండా నిధులను సకాలానికే విడుదలచేయాలని కోరుతున్నాను.
- భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు సంబంధించి సైట్ క్లియరెన్స్ అప్రూవల్ గడువు ముగిసింది. తాజాగా క్లియరెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈమేరకు పౌరవిమానయాన శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
- రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కడపలో సమగ్ర స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మెకాన్ ఇప్పటికీ తన నివేదికను ఇవ్వలేదు. రాయలసీమ, కడప జిల్లా ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నడుంబిగించింది. దీనికోసం వైయస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. ఈమేరకు కేంద్రం తోడ్పాటు అందించాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
- రాష్ట్రంలో 11 బోధనాసుపత్రులు ఉన్నాయి. కొత్తగా మరో మూడింటికి కేంద్రం అనుమతులు మంజూరుచేసింది. వీటి పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరో 12 బోధనాసుపత్రులకు కూడా వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాం.
- విభజన కారణంగా రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లింది. రెవిన్యూ గ్యాప్ భర్తీకోసం ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉంది. ఆమేరకు ఆర్థికంగా ఏపీకి నష్టం వాటిల్లింది. విభజన నాటికి పెండింగ్ బిల్లుల బకాయిల రూపంలో, 10వ వేతన సంఘం సిఫార్సుల అమలులో భాగంగా ఇవ్వాల్సి బకాయిల రూపంలో తదితర కార్యక్రమాల వల్ల దాదాపు రూ.32,625.25 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తన సొంతంగా ఖర్చు చేసింది. ఈ నిధులను రెవిన్యూ లోటు కింద భర్తీచేయాలి.
- రాష్ట్ర విభజన వల్ల 58.32శాతం జనాభా విభజిత ఆంధ్రప్రదేశ్‌కురాగా, కేవలం 46శాతం రెవిన్యూ మాత్రమే దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 9శాతం జానాభా ఉన్న హైదరాబాద్ నగరంను కోల్పోవడంద్వారా ఆ నగరం నుంచి అందే 38శాతం రెవిన్యూను కోల్పోయాం. తర్వాత వచ్చిన కోవిడ్.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బతీసింది. దాదాపు రూ. 33,478 కోట్ల మేర ఆదాయం కోవిడ్ కారణంగా రాకుండాపోయింది. కోవిడ్ నివారణా, చికిత్సలకోసం మరో రూ.7,130 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయి. 15వ ఆర్థిక సంఘం కేటాయింపులు కూడా రాష్ట్రానికి తగ్గడం మరొక ప్రతికూల పరిణామం.