Begin typing your search above and press return to search.
ఫొటో వైరల్ః మోడీ పెట్టింది గుండు సున్నా.. అమ్మింది 16
By: Tupaki Desk | 15 March 2021 6:30 AM GMTగుజరాత్ ను అభివృద్ధి పథంలో నడిపాడు.. ఇక మిగిలింది దేశాన్ని అగ్రరాజ్యానికి ధీటుగా నిలపడమే అన్నట్టుగా ప్రచారం చేసింది బీజేపీ 2014లో! కాంగ్రెస్ డీలాపడిపోవడం.. మోడీ గాలివీచడంతో ఆ ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు మోడీ. అయితే.. ఇప్పటి వరకూ ఆయన ప్రధానిగా చేసి చూపిన అభివృద్ధి ఇదేనంటూ ఓ ఫొటోలోని లెక్కలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
గడిచిన ఆరేళ్లుగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అమ్మడాన్ని పెద్దగా ప్రచారంలోకి రాకుండా చూసుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.. సర్కారు సంస్థలను ప్రైవేటు వాళ్లకు అమ్మేయడమే తమ విధానం అన్నట్టుగా బాహాటంగా ప్రకటించింది. ప్రైవేటీకరణ జరిగితేనే అభివృద్ధి జరుగుతుందని, వ్యాపారం ప్రభుత్వ పని కాదంటూ కొత్త సూత్రం కూడా చెప్పుకు రావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో స్వాతంత్రం వచ్చిన కానుంచి.. ఇప్పటి వరకూ దేశంలో ప్రధానులు ఎన్ని ప్రభుత్వ సంస్థలను స్థాపించారు..? ఎన్ని సంస్థలను అమ్మేశారనే ఓ లెక్క బయటకు వచ్చింది. ఇందులో.. ఇందిరా గాంధీ, నెహ్రూ అత్యధికంగా ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పారు. అదే సమయంలో ఒక్క సంస్థను కూడా వారు అమ్మలేదు. వీరి తర్వాత వచ్చిన చాలా మంది కూడా ప్రభుత్వ సంస్థలను స్థాపించారే తప్ప అమ్మలేదు.
కానీ.. నరేంద్ర మోడీ మాత్రం ఒక్క ఫ్యాక్టరీని కూడా స్థాపించకపోగా.. ఏకంగా 16 సంస్థలను అమ్మేశారు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతోపాటు ఐదు సంస్థలను కూడా అమ్మేసేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో నరేంద్ర మోడీకి ముందున్న ప్రధానులంతా కనీసం ఒకటీ రెండు సంస్థలనైనా స్థాపించడం విశేషం. ఈ వివరాలతో కూడిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.