Begin typing your search above and press return to search.
మోడీ తాజా సంచలనాలు ఇవే
By: Tupaki Desk | 29 Nov 2016 11:05 AM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకకాలంలో ఇటు దేశం - అటు ప్రపంచం చూపును తనవైపునకు తిప్పుకొన్నారు. తనదైన శైలిలో దూసుకోవడం ద్వారా ఒక గుర్తింపును - నల్లధనం విషయంలో మరో ఝలక్ ఇవ్వడం ద్వారా దేశం చూపును తనవైపు తిప్పుకున్నారు. టెమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ -2016 పోల్ లో ప్రధాని నరేంద్ర మోడీ టాప్ లో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ - రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ లను అధిగమించి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. పర్సన్ ఆఫ్ ది ఇయర్ కోసం టైమ్స్ మ్యాగజైన్ నిర్వహిస్తున్న ఆన్ లైన్ పోల్ లో ప్రధాని నరేంద్ర మోడీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఆయన తరువాతి స్థానాలలో వరుసగా డోనాల్డ్ ట్రంప్ - వ్లాదిమీర్ పుతిన్ - బరాక్ ఒబామా ఉన్నారు.
పార్టీపార్లమెంటరీ సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆదాయపు చట్ట సవరణ బిల్లును ఆమోదించేందుకు నేడు ఎంపీలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దేశంలో నల్ల ధనాన్ని ముక్కు పిండి వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. నల్లధనం నివారణ - ఇ-బ్యాంకింగ్ పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఏయే కార్యక్రమాలు చేపడితే బాగుంటుందో జాతీయ పార్టీ కార్యాలయానికి వివరాలు అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. ముక్కుపిండి వసూలు చేసిన నల్ల ధనాన్ని సామాన్య ప్రజల కోసమే ఖర్చు చేస్తామన్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా పేదలకు ఖర్చు చేస్తామన్నారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రజలు తమవైపే ఉన్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. మహారాష్ట్ర, గుజరాత్ లో స్థానిక సంస్థల ఫలితాలు వెలువడిన తీరును ప్రస్తావిస్తూ రెండు చోట్ల బీజేపీని గెలిపించడమే ఇందుకు నిదర్శనమని జవదేకర్ అన్నారు. తమను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. నల్ల ధనంపై తాము చేస్తోన్న పోరాటానికి స్థానిక సంస్థల్లో మద్దతునివ్వడం చూసి అయిన విపక్షాలు విమర్శలు మానుకోవాలని జవేదకర్ అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/