Begin typing your search above and press return to search.
పవన్ ను మోడీ పూర్తిగా పక్కన పెట్టేసినట్లే..
By: Tupaki Desk | 18 Sept 2017 10:16 PM IST2014 ఎన్నికల్లో మోడీతో సఖ్యతగా ఉంటూ బీజేపీకి - దాని మిత్రపక్షం టీడీపీకి ప్రచారం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు అప్పట్లో మారుమోగిపోయింది. ఏపీలో టీడీపీ-బీజేపీ కూటమి విజయానికి ఆయనే కారణమంటూ మోత మోగించారు. అంతేకాదు... మోడీ వద్ద పవన్ కు మాంచి ఇమేజ్ ఉందన్న మాటా అందరి నోళ్లలో నానింది. అదంతా ఎంతవరకు నిజమన్నది పక్కన పెడితే.. ప్రస్తుతం మోడీ వద్ద పవన్ ఇమేజ్ ఏంటి అన్నది తాజా పరిణామాలు బయటపెట్టాయి. స్వచ్ఛభారత్ ప్రమోషన్ కోసం తెలుగుసినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులకు లేఖలు రాసిన మోడీ పవన్ కు మాత్రం లేఖ రాయలేదు. దీంతో సినీ ఇండస్ర్టీతో పాటు ఏపీ రాజకీయాల్లో ఇది చర్చనీయమవుతోంది.
గత ఎన్నికల్లో పవన్ మోడీ తరఫున వకాల్తా పుచ్చుకుని ప్రచారం చేశారు. ఏపీలో పెట్టిన సభలో మోదీ కూడా పవన్‌ను ప్రశంసించారు. అయితే, ఇప్పుడు మాత్రం సీన్ తేడా కొడుతోంది. కేంద్ర ప్రభుత్వంపై పవన్ విమర్శలు చేస్తోన్న నేపథ్యంలో మోడీ ఆయన్ను పట్టించుకోవడం మానేసినట్లు తెలుస్తోంది. తాజాగా, మోడీ దేశంలోని వివిధ రంగాల ప్రముఖులకు లేఖలు రాసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో తెలుగు సినీ ప్రముఖులు రాజమౌళి - మోహన్ బాబు - ప్రభాస్ - మహేశ్ బాబు ఉన్నారు. మోహన్ లాల్ - అనిల్ కపూర్ అనుష్కశర్మలకు కూడా మోబా లేఖలు రాశారు.
అయితే, తనకు గతంలో మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్‌కు ఆయన లేఖ రాయకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో అయిన పవన్ రాజకీయాల్లో యాక్టివ్ అవుతుండడం... బీజేపీని టార్గెట్ చేస్తుండడంతోనే మోడీ ఆయన్ను నెగ్లక్ట్ చేసినట్లుగా విశ్లేషిస్తున్నారు.