Begin typing your search above and press return to search.
యాపిల్.. ఆండ్రాయిడ్ కు భారీ దెబ్బేసేలా మోడీ మార్క్ నిర్ణయం!
By: Tupaki Desk | 17 Jan 2023 4:00 AM GMTసంపన్న.. పేద అన్నతేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో ‘కీ’ రోల్ ప్లే చేస్తోంది మొబైల్ ఫోన్. స్మార్ట్ ఫోన్ ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే మనిషిని తనకు బానిసలా చేసుకోవటంలో సక్సెస్ అయ్యిందని చెప్పాలి.
స్మార్ట్ ఫోన్ వినియోగంతో జీవితం మరింత సౌకర్యవంతంగా మారటంతోపాటు.. జీవన ప్రయాణ వేగం అపరిమితంగా మారిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అదే సమయంలో.. మన చేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ వెనుక కొన్ని కోట్ల కోట్లాది రూపాయిల వ్యాపారం ఉందన్నది మర్చిపోకూడదు.
తెలీకుండానే మన మీద.. మన డేటా మీద ఒక కన్నేసిన కంపెనీలకు యాపిల్.. గూగుల్ వారి ఆండ్రాయిడ్ ఓఎస్ లు కీలకంగా మారాయని చెప్పాలి. స్మార్ట్ ఫోన్లు వాడే వారికి అందుబాటులో పలు ఓఎస్ లు ఉన్నా.. గూగుల్ ఆండ్రాయిడ్.. యాపిల్ వారి సొంత ఓఎస్ పైనే అందరూ ఆధారపడుతున్నారు. శాంసంగ్.. నోకియా కంపెనీలకు చెందిన సొంత ఓఎస్ ఉన్నప్పటికీ అదంత ఆదరణ చెందలేదన్న విషయం తెలిసిందే.
అలాంటి ఓఎస్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది భారత సర్కారు. దేశ ప్రజలకు దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం తయారు చేయటం ద్వారా.. వినియోగదారులకు మరింత సురక్షితమైన అనుభవాన్ని అందించేందుకు వీలుగా దేశీయ ఓఎస్ కు సంబంధించిన ఒక ప్రాజెక్టు వేగంగా సాగుతున్నట్లుగాచెబుతున్నారు. అయితే.. దీనిపై ప్రభుత్వం ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మోడీ సర్కారు రూపొందిస్తున్న ఈ ఓఎస్ కు ఇండ్ ఎఎస్ పేరుతో అందుబాటులోకి తీసుకొస్తారని చెబుతున్నారు. ప్రభుత్వం.. స్టార్టప్ లు.. విద్యా సంస్థల చొరవతో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారని తెలుస్తోంది. అయితే.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందన్న విషయంపై క్లారిటీ రావటం లేదు.
ఇండ్ ఓఎస్ కానీ మార్కెట్ లోకి వస్తే.. గూగుల్ ఆండ్రాయిడ్ కు.. యాపిల్ కు పెద్ద దెబ్బ తగలటం ఖాయమంటున్నారు. అయితే.. మొబైల్ మార్కెట్ లో 97 శాతం వాటాతో తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తున్న గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ ప్రాభవాన్ని.. ప్రాబల్యాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.