Begin typing your search above and press return to search.
మోడీ మాష్టారు ఓకే చేశారు.. కేసీఆర్ మాటేమిటి?
By: Tupaki Desk | 30 Aug 2020 6:30 AM GMTకరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ను దశల వారీగా ఎత్తేస్తున్న వైనం తెలిసిందే. తాజాగా అన్ లాక్ 4 మార్గదర్శకాల్ని కేంద్రం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మెట్రో సర్వీసుల్ని వచ్చే నెల (సెప్టెంబరు ఏడు నుంచి ప్రారంభించొచ్చని పేర్కొంది. మోడీ సర్కారు ఓకే అన్నప్పటికి.. ఆయా రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో మోడీ మాస్టారు ఓకే అన్న మెట్రో విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నదిప్పుడు సందేహంగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. నేటికి తెలంగాణలో కేసుల నమోదు ఒక కొలిక్కి రాలేదు. తెలంగాణ.. తమిళనాడు.. మహారాష్ట్ర లలో కరోనా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉన్నప్పటికీ.. రోజుకో తీరులో కేసులు నమోదవుతున్నాయి.
కీలకమైన హైదరాబాద్ మహానగరంలో కేసుల తీవ్రత గతంతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. ఒక దశలో రోజుకు 1300 కేసులు కూడా నమోదైన పరిస్థితి. అందుకు భిన్నంగా ఇప్పుడునాలుగైదు వందల మధ్య కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు ఒక కొలిక్కి వస్తున్న వేళ.. మెట్రోను నడుపుతూ నిర్ణయం తసుకుంటే.. కేసులు పెరిగితే మళ్లీ ఇబ్బందులు తప్పవంటున్నారు. చాలా నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ లో ఆంక్షల్ని అంతకంతకూ ఎత్తేస్తున్న వేళ.. మెట్రో ను కేంద్రం చెప్పినట్లుగా ఏడో తేదీ నుంచి స్టార్ట్ చేసే వీలుందన్న మాట వినిపిస్తోంది.
మరోవైపు.. కరోనా నేపథ్యంలో మెట్రోను ఆపటం ద్వారా ఇప్పటికే దాదాపు రూ.50 కోట్ల మేర నష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది. మరింతకాలం నడపకుంటే ఈ నష్టం మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ మెట్రోను నడిపేలా నిర్ణయం తీసుకుంటారా? లేక.. ఇప్పుడున్న పరిస్థితిని కంటిన్యూ చేస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. ఏమైనా..హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు పట్టాలు ఎక్కే విషయంలో సీఎం కేసీఆర్ మాటే ఫైనల్ అవుతుందని చెప్పక తప్పదు.