Begin typing your search above and press return to search.

క‌మ‌ల ద‌ళాధిప‌తికి ఏపీలో `కాలా`ఎవ‌రు?

By:  Tupaki Desk   |   2 July 2018 1:57 PM GMT
క‌మ‌ల ద‌ళాధిప‌తికి ఏపీలో `కాలా`ఎవ‌రు?
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న‌ - విభ‌జ‌న హామీల అమ‌లు కోసం వైసీపీ చాలాకాలంగా పోరాటం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టికీ వైసీపీ అధినేత జ‌గ‌న్ చిత్తశుద్ధితో హోదా గోదాలో మొదటి నుంచి ఒకేమాట‌పై నిల‌బ‌డ్డారు. నేడు కూడా హోదా విష‌యంలో అదే పంథాను కొన‌సాగిస్తున్నారు. మ‌రోవైపు - అధికారంలో ఉన్న టీడీపీ వైఖ‌రి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎన్డీఏ హ‌యాంలో ప్ర‌వేశ‌పెట్టిన గ‌త‌ బ‌డ్జెట్ లో ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని తెలుసుకున్న త‌ర్వాత బీజేపీతో టీడీపీ తెగ‌దెంపులు చేసుకుంది. అప్ప‌టివ‌ర‌కు దొంగ‌నిద్ర న‌టిస్తోన్న టీడీపీ...ఒక్క‌సారిగా మేలుకోవాల్సిన ప‌రిస్థితుల‌ను కొని తెచ్చుకుంది. ఆ త‌ర్వాత తిరుమ‌ల‌లో ప‌ర్య‌టించిన బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా హోదా సెగ త‌గిలిన సంగ‌తి తెలిసిందే. అలిపిరి వ‌ద్ద షా కాన్వాయ్ పై టీడీపీ నేత‌లు రాళ్ల‌తో దాడి చేశారు. నేప‌థ్యంలోనే ఈ నెల 22న ఏకంగా ప్ర‌ధాని మోదీ ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. అయితే, మోదీకి కూడా షా త‌ర‌హాలో నిర‌సన వ్య‌క్త‌మ‌వుతుందా? లేదా? అన్న విష‌యం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

కావేరీ జ‌ల వివాదం నేప‌థ్యంలో కొద్ది రోజుల క్రితం త‌మిళ‌నాడులో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని మోదీకి త‌మిళ ప్ర‌జ‌లు నిర‌స‌న తెలిపిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ తంబీల ఆగ్ర‌హాన్ని చ‌విచూడాల్సి వ‌స్తుంద‌ని....మోదీ ఏకంగా త‌న రూట్ మార్చుకొని హెలికాప్ట‌ర్ లో త‌మిళ‌నాడులో ల్యాండ్ అయ్యారు.

అయితే, మోదీక‌న్నా రెండాకులు ఎక్కువ చ‌దివిన తంబీలు....భార సైజులో న‌ల్ల బెలూన్ల‌ను ఎగురవేసి త‌మ నిర‌స‌న తెలిపారు. అయితే, ప్ర‌స్తుతం బీజేపీపై ఏపీ ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆగ్ర‌హావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 22న శ్రీహరికోటలో మోదీ ప‌ర్య‌టించ‌నున్నారు. షార్ లో నూతన భవన ప్రారంభోత్సవం ఆయన చేతుల మీదుగా జ‌ర‌గ‌నుంది. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఉండి....సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ప్ర‌వేశం లేని షార్ లోని హెలిప్యాడ్ వద్ద డైరెక్ట్ గా మోదీ ల్యాండ్ అవుతారు. అయితే, మోదీ - బీజేపీల‌పై ఒంటికాలుపై లేస్తోన్న టీడీపీ షార్ లో ప్ర‌త్య‌క్షంగానో....ప‌రోక్షంగానో మోదీకి నిర‌స‌న తెలుపుతుందా లేదా అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న. కేవ‌లం పేప‌ర్ పులుల్లాగా ....రాత‌ల‌కే మోదీని టీడీపీ విమ‌ర్శిస్తోందా...లేదా అన్న‌ది తేల‌నుంది. క‌నీసం - త‌మిళనాడు త‌ర‌హాలో ప్రధానికి నల్ల బెలూన్లను ఎగురవేసి నిర‌స‌న తెలిపే కార్య‌క్ర‌మం టీడీపీ లేదా మ‌రే పార్టీ అయినా చేప‌డుతుందా అన్న‌ది తేలాల్సి ఉంది. వాస్త‌వానికి ఆ కార్య‌క్ర‌మానికి సీఎం హోదాలో చంద్ర‌బాబు కూడా హాజ‌రు కావాల్సి ఉంది. అయితే, దానికి చంద్ర‌బాబు హాజ‌ర‌వ‌డంపై ఇప్ప‌టికి ఎటువంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.