Begin typing your search above and press return to search.
మోడీనా మజాకా.. ఎన్నికలు ఉంటే చాలు.. కరుణ కురవాల్సిందే!
By: Tupaki Desk | 11 Dec 2022 1:32 PM GMTగుజరాత్ అయిపోయింది.. హిమాచల్ ప్రదేశ్ కూడా అయిపోయింది. ఇక ఇప్పుడు మోడీ చూపు.. మహారాష్ట్ర, గోవాలపై పడింది. ఎందుకంటే..వచ్చే ఏడాది కర్ణాటక, మహారాష్ట్ర, గోవాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలపై ప్రధాని ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు 75 వేల కోట్లు, గోవాకు సుమారు 3 వేల కోట్లు మోడీ కుమ్మరిస్తున్నారు.
ఏదేమైనా.. ఊరకరారు మహానుభావులు అన్నచందంగా.. మోడీ కూడా ఊరికేనే ఆయా రాష్ట్రాలపై కరుణ కురిపించడం లేదు. తనకు మిక్కిలి లాభం.. ఉంటేనే ఆయన మితమైనా కదులుతారనే నానుడిని నిజం చేస్తున్నారు. అంతేకాదు, ఆదివారం ప్రధాని ఆయా రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన కూడా చేయనున్నారు. మహారాష్ట్రకు ఇచ్చే 75,000 కోట్ల రూపాయలకుగాను పలు మెగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
దీంతోపాటు గోవాలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా అందుబాటులోకి తీసుకున్నారు. గోవాలో సుమారు 2,870 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మోడీ ప్రారంభించ నున్నారు. అదేవిధంగా మూడు జాతీయ ఆయుష్ ఇన్‌స్టిట్యూట్‌లను కూడా మోడీ ప్రారంభించనున్నారు. ఈ మూడు ఆయుష్ ఇన్‌స్టిట్యూట్‌లను 970 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు.
ఇక, కీలకమైన నాగ్‌పూర్ - షిర్డీని అనుసంధానిస్తూ నిర్మించిన 520 కిలోమీటర్ల మేరకు నిర్మించిన ఎక్స్‌ప్రెస్ వేను మోడీ ప్రారంభిస్తారు. దేశంలోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేలలో ఒకటి. మహారాష్ట్రలోని 10 జిల్లాల గుండా వెళ్తుంది. దీని నిర్మాణ వ్యయం 55 వేల కోట్ల రూపాయలు. మొత్తంగా.. చూస్తే.. ఎన్నికలు ఉంటే తప్ప.. మోడీకి రాష్ట్రాలు గుర్తుకు రావనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అదికూడా తనకు , తన పార్టీకి ప్రయోజనం ఉంటే తప్ప.. అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.