Begin typing your search above and press return to search.
అన్ని దేశాల వారికి రాని ఐడియా మోడీకే వచ్చిందా?
By: Tupaki Desk | 17 Dec 2021 3:36 AM GMTసంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నరేంద్ర మోడీ సర్కారు తాజాగా తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి నిర్ణయం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అమ్మాయి పెళ్లి వయసు ఇప్పుడున్న 18 ఏళ్లకు బదులుగా 21 ఏళ్లకు పెంచటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. కొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు కానీ.. వాస్తవిక ధోరణిలో చూస్తే.. ఇది సరైన నిర్ణయం కాదంటున్నారు. తమ వాదనకు సాక్ష్యంగా పలు దేశాల్లో అమ్మాయిల పెళ్లి వయసుపై ఉన్న పరిమితిని ప్రస్తావిస్తున్నారు.
కొందరు ప్రభుత్వ వాదనను సమర్థిస్తున్నారు. కానీ.. వారంతా ప్రాక్టికాలిటీని.. మన సమాజంలోని క్లిష్టమైన పలు అంశాల్ని మర్చిపోతున్నారని చెప్పాలి. ఎవరెంత చెప్పినా.. అమ్మాయికి పద్దెనిమిదేళ్లు వచ్చినంతనే పెళ్లి చేసేద్దామని భావించే తల్లిదండ్రులు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ మధ్యనే అలాంటి ధోరణిలో మార్పు వస్తోంది. అయితే.. తాజాగా కేంద్రంలోని మోడీ సర్కారు.. అమ్మాయిల వివాహ కనీస వయసు పద్దెనిమిదేళ్ల నుంచి ఇరవై ఒక్క ఏళ్లకు పెంచిన వైనం కారణంగా బాల్య వివాహాలు మరింత పెరుగుతాయన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకాలం కనీస అర్హత వయసు పద్దెనిమిదేళ్లు కావటంతో.. పద్నాలుగు.. పదహారేళ్ల వయసుకు రాగానే పెళ్లి చేసే ఆలోచనను మార్చుకుంటున్నారు. రెండు.. మూడేళ్ల తేడాతో పెళ్లి చేసి కేసుల తలనొప్పిని ఎదుర్కొనే కన్నా.. పద్దెనిమిదేళ్లు వచ్చే వరకు ఆగితే మంచిదన్న ఆలోచనలో ఉన్నారు. అయితే.. మోడీ సర్కారు తీసుకొచ్చిన కొత్త రూల్ కారణంగా.. అమ్మాయి పెళ్లి చేయాలంటే 21 ఏళ్లు తప్పనిసరి.
దేశంలోని పట్టణ..నగర ప్రాంతాల సంగతి సరే. ఎక్కువమంది ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిర్ణయంపై విముఖత వ్యక్తం కావటం ఖాయమంటున్నారు. తాజా నిర్ణయంతో అమ్మాయిలు తమకు నచ్చిన వారిని పెళ్లాడే స్వేచ్ఛను కోల్పోతుంది. పరువు.. కులం పేరుతో తల్లిదండ్రులు దీన్నో ఆయుధంగా వాడుకునే అవకాశం ఉంది. ఇప్పుడు చూస్తే.. ఎక్కువ కేసుల్లో 18 ఏళ్లు నిండకుండానే నచ్చిన వ్యక్తిని పెళ్లాడిన అమ్మాయిల తల్లిదండ్రులు పెడుతున్న కేసులే కనిపిస్తాయి. ప్రపంచంలోని వివిధ ఖండాల్లోని వేర్వేరు దేశాల్లో అమ్మాయిల.. అబ్బాయిల కనీస వివాహ వయసు చూస్తే.. చాలాచోట్ల 18 ఏళ్లే ఉండటం గమనార్హం. ఇలాంటివేళ.. గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉండే మన దేశంలో కేంద్రం తీసుకున్ని నిర్ణయం.. బాల్య వివాహాల్ని పెంచేలా చేస్తుందన్న వాదనకు తెర తీస్తోంది.
ప్రపంచంలోని పలు దేశాల్లో అమ్మాయిలకు.. అబ్బాయిలకు ఉన్న కనీస వివాహ వయసును చూస్తే..
దేశం అమ్మాయి అబ్బాయి
అమెరికా 18 18
చైనా 20 22
ఆస్ట్రేలియా 18 18
అర్జెంటీనా 18 18
జర్మనీ 18 18
ఫ్రాన్స్ 18 18
యూకే 18 18
రష్యా 18 18
జపాన్ 20 20
కెనడా 18 18
ఇండోనేషియా 16 19
పాకిస్థాన్ 16 18
బంగ్లాదేశ్ 18 21
బ్రెజిల్ 18 18
నోట్.. అమెరికాలోని మూడు నాలుగు రాష్ట్రాల్లో తప్పించి మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనే అబ్బాయికి 18 ఏళ్లు.. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకునే అర్హత వస్తుంది.