Begin typing your search above and press return to search.
మోడీ బ్యాచ్ పై ఫేస్ బుక్ ర్యాంకులు ఇచ్చేసింది
By: Tupaki Desk | 26 May 2016 6:01 PM GMTసమయానికి తగ్గట్లు వ్యవహరించటం ఫేస్ బుక్ కు ఒకరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రెండ్ ను తగ్గట్లుగా దూసుకెళ్లే ఫేస్ బుక్ ఎంత వేగంగా వ్యవహరిస్తుందో తాజాగా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో పండువలా చేస్తున్న వైనాన్ని గుర్తించిన ఫేస్ బుక్ తనదైన శైలిలో మోడీ సర్కారు గురించి వివరాల్ని వెల్లడించటం గమనార్హం.
మోడీ సర్కారుకు ఫేస్ బుక్ కు లింకు ఎక్కడ? అన్న డౌట్ రావటం తర్వాత సంగతి.. నిజమే కదా.. ఈ యాంగిల్ లో ఆలోచించలేదే అన్న భావన కలిగేలా ఎఫ్ బి వ్యవహరించటం విశేషం. గడిచిన రెండేళ్లలో ఫేస్ బుక్ ను ఉపయోగించి ప్రధాని మోడీ.. ఆయన క్యాబినెట్ లోని మంత్రులు ఎంత చురుగ్గా ఉన్నారన్న అంశంపై ర్యాంకులు ప్రకటించటమే కాదు.. మోడీ పోస్ట్ చేసిన పోస్టుల్లో అత్యధిక ఆదరణ ఏ పోస్ట్ కి వచ్చిందన్న విషయాన్ని చెప్పుకొచ్చింది. 2014 మే 26 నుంచి 2016 మే 23 వరకు ఫేస్ బుక్ లో మోడీ పెట్టిన పోస్టుల్లో తన తల్లితో పెట్టిన పోస్ట్ కి 34.04 కోట్ల లైక్స్ వచ్చినట్లుగా వెల్లడించింది.
ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ ను.. అమెరికా అధ్యక్షుడు ఒబామా.. టర్కీ అధినేత ఎర్డొగన్ లతో ఉన్న పోస్టులకు అత్యధిక ఆదరణ వచ్చిన విషయాన్ని చెప్పిన ఫేస్ బుక్.. మోడీ క్యాబినెట్ లోని మంత్రులకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చింది. ఇక.. ఫేస్ బుక్ లో ఎంత యాక్టివ్ గా ఉన్నారన్న అంశంపై ర్యాంకులు ఇచ్చింది.
మోడీ క్యాబినెట్ కు సంబంధించి ఎఫ్ బీ వెల్లడించిన విశేషాలు చూస్తే..
= మోడీ మంత్రివర్గంలోని 50 మంది మంత్రుల అకౌంట్లలో 47 ఫేస్ బుక్ వెరిఫై చేసినవే
= ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన అనురాగ్ ఠాకూర్.. స్మృతి ఇరానీలు ఎఫ్ బీ లైవ్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు
= ఫేస్ బుక్ లైవ్ ద్వారా ప్రధాని మోడీ వెబ్ సైట్ నరేంద్రమోడీ.ఇన్ ప్రజలకు చేరువైంది
= టూరిజం.. వ్యవసాయం.. డిజిటల్ ఇండియా.. రైల్వేలు.. మహిళా సంక్షేమం.. ఆర్థిక రంగం.. డిఫెన్స్.. ఆయుష్ తదితర రంగాలకు చెందిన పోస్టులను ప్రధాని వెబ్ సైట్ తరచూ పోస్ట్ చేసింది
= మేకిన్ ఇండియా.. డిజిటల్ ఇండియా.. స్కిల్ ఇండియా పథకాలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన ఉంది
ఇక.. ఎఫ్ బీలో యాక్టివ్ గా ఉండే మోడీ అండ్ కోకు ఇచ్చిన ర్యాంకుల్లో టాప్ టెన్ ఎవరంటే..
1. నరేంద్ర మోడీ
2. రాజ్ నాథ్ సింగ్
3. స్మృతి ఇరానీ
4. అరుణ్ జైట్లీ
5. హర్ సిమ్రత్ కౌర్ బాదల్
6. పియూష్ గోయల్
7. రవిశంకర్ ప్రసాద్
8. నితిన్ గడ్కరీ
9. వెంకయ్యనాయుడు
10. మేనకాగాంధీ