Begin typing your search above and press return to search.

మోడీ కొత్త టీం రెడీ: ఎవరెవరికి ఏ శాఖలంటే?

By:  Tupaki Desk   |   8 July 2021 3:01 AM GMT
మోడీ కొత్త టీం రెడీ: ఎవరెవరికి ఏ శాఖలంటే?
X
ప్రధాని మోడీ తన కేబినెట్ ను ప్రక్షాళన చేశాడు. సీనియర్లకు మంగళం పాడి బాగా పనిచేస్తున్న వారు.. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. తెలంగాణకు చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఈ క్రమంలోనే ప్రమోషన్ కల్పించారు. రవిశంకర్,జవదేకర్, హర్షవర్ధన్ లాంటి బీజేపీ సీనియర్ కేంద్రమంత్రులకు ఉద్వాసన పలికారు.

ప్రధాని మోడీ పునర్వ్యస్తీకరించిన కేబినెట్ లో 36మంది కొత్త ముఖాలున్నాయి. ఇందులో ఎనిమిది మంది న్యాయవాదులు, నలుగురు వైద్యులు, ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు, నలుగురు ఎంబీఏ డిగ్రీ హోల్డర్లు, పలువురు ఇంజనీర్లతోపాటు ఇది నిపుణులు సంపూర్ణ సమ్మేళంగా గుర్తించబడింది.

మే 2019లో ప్రధాని నరేంద్రమోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో కేబినెట్ ప్రక్షాళన చేయడం ఇదేప్రథమం. 43 మందిలో 15 మంది మంత్రులను కేంద్ర మంత్రివర్గంలో.. 28 మంది మంత్రులను రాష్ట్ర మంతులుగా చేర్చారు. ఇందులో 12 మంది సీనియర్లను కేంద్రమంత్రి పదవుల నుంచి మోడీ తొలగించారు.

కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్, న్యాయ, ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, విద్యాశాఖ మంత్రి రమేశ్ ఫోక్రియాల్, పర్యావరణ మంత్రి జవదేకర్ లు మోడీ క్యాబినెట్ నుంచి వైదొలిగారు.

-కేంద్ర మంత్రులు-వారి శాఖలు ఇవే..

1. నరేంద్రమోడీ - ప్రధానమంత్రి, ఉద్యోగుల మంత్రిత్వ శాఖ, పబ్లిక్ గ్రీవెన్స్ , పెన్షన్లు, అణుశక్తి శాఖ, డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ ఇతర మంత్రులకు కేటాయించనివి.
2.అమిత్ షా- హోంశాఖ, అదనంగా సహకార మంత్రిత్వ శాఖ
3.రాజ్ నాథ్ సింగ్- రక్షణశాఖ
4. నిర్మలా సీతారామన్- ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు
5. నితిన్ జైరామ్ గడ్కరీ- జాతీయ రహదారులు, రవాణా శాఖ
6. డాక్టర్ సుబ్రమణ్యం జైశంకర్- విదేశీ వ్యవహారాల శాఖ
7. నరేంద్ర సింగ్ తోమర్ - వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ
8. జి.కిషన్ రెడ్డి - సాంస్కృతిక శాఖ, టూరిజం శాఖ, ఈశాన్య రాష్రాల అభివృద్ధి
9. రాజ్ కుమార్ సింగ్ - పవర్ మినిస్రీ, న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ శాఖ
10. పీయూష్ గోయల్- వాణిజ్యం మరియు పరిశ్రమలు, టెక్స్ టైల్ శాఖ, వినియోగదారుల సంక్షేమ శాఖ, ఆహారం మరియు పబ్లిక్ డస్రిబ్యూషన్
11. ధర్మేంద్ర ప్రధాన్- విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు ఆంత్రపైన్యూర్ షిప్ శాఖ
12. ప్రహ్లాద్ జోషి- పార్లమెంటరీ వ్యవహారాలు, కోల్(బొగ్గు), మైన్స్ శాఖలు
13. నారాయణ్ తాటు రాణే- మైక్రో స్మాట్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస శాఖ
14. సర్బానంద సోనోవాల్ - పోర్టులు, షిప్పింగ్, జలవనరుల శాఖ, ఆయుష్ శాఖలు
15. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ- మైనార్టీ వ్యవహారాల శాఖ
16. డాక్టర్ వీరంద్రకుమార్ - సామాజిక న్యాయం మరియు సాధికారిక శాఖ
17. గిరిరాజ్ సింగ్ - గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు
18. జ్యోతిరాదిత్య సింధియా- పౌరవిమానయాన శాఖ
19. రామచంద్ర ప్రసాద్ సింగ్ - ఉక్కు మంత్రిత్వ శాఖ
20. అశ్విని వైష్ణవ్ - రైల్వే శాఖ, కమ్యూనికేషన్స్ శాఖ, ఎలక్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖలు
21. పశుపతి కుమార్ షారన్ - ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ
22. గజేంద్ర సింగ్ షెకావత్ - జలశక్తి మంత్రిత్వ శాఖ
23. కిరెణ్ రిజిజు - న్యాయశాఖ
24.స్మృతి ఇరానీ- మహిళా, శిశు సంక్షేమ శాఖ
25. హర్ దీప్ పూరీ - పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ, గృహ నిర్మాణ మరియు పట్టణాభివృద్ధి శాఖ
26. మంసుఖ్ మాండవీయ - ఆరోగ్యం మరియు కుటుంబసంక్షేమ శాఖ, రసాయనాలు మరియు ఎరువుల శాఖ
27. భూపేంద్ర యాదవ్ - పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ, లేబర్ అండ్ ఎంప్లాయ్ మెంట్ శాఖ
28.మహేంద్ర నాథ్ పాండే - భారీ పరీశ్రమల శాఖ
29. పర్షోత్తమ్ రూపాలా - ఫిషరీస్, యానిమల్ హస్పెండరీ మరియు డెయిరీ శాఖ
30.అర్జున్ ముండా- ట్రైబల్ ఎఫైర్స్
31. అనురాగ్ సింగ్ ఠాకూర్ - సమాచారం మరియు బ్రాడ్ కాస్టింగ్ శాఖ, యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖలు

* స్వతంత్ర హోదా - శాఖలు

1. రావు ఇందర్ జిత్ సింగ్ - గణాంకాలు, ప్రణాళిక,కార్పొరేట్ వ్యవహారాలు
2. డాక్టర్ జితేంద్ర సింగ్ - శాస్ర్త సాంకేతికత, ఎర్త్ సైన్స్ సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ