Begin typing your search above and press return to search.
అకౌంట్ల లో డబ్బులు..రైతులకు మోడీ న్యూ ఇయర్ కానుక
By: Tupaki Desk | 1 Jan 2020 6:44 AM GMTప్రధాని నరేంద్ర మోడీ కొత్త సంవత్సరం సందర్భంగా రైతులకు అదిరిపోయే కానుక ఇవ్వబోతున్నారు. ప్రతి సంవత్సరం రైతులకు పెట్టుబడి సాయంగా రూ.6వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే.. మూడు విడతలుగా రూ.2వేలు చొప్పున అందిస్తున్నారు.
నూతన సంవత్సరం కానుకగా జనవరి 2న, 2020న పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న 6 కోట్ల మంది రైతులకు మోడీ రూ.2వేలు జమ చేయనున్నారు. మొత్తం 12000 కోట్లను వారి ఖాతాల్లో మోడీ సర్కారు జమ చేయబోతోంది. 2019 డిసెంబర్ చివరి విడత పడాల్సిన రూ.2000 డబ్బులను రైతులకు జనవరి 2న అందించనున్నారు. ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ లింక్ చేసిన వారికి మాత్రమే ఈ డబ్బులను మోడీ సర్కారు అందజేస్తోంది.
ఇప్పటికే పీఎం కిసాన్ పథకంలో ఆధార్ కార్డు తో పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లింక్ చేసిన రైతులకు ఈ జనవరి 2న డబ్బులు పడనున్నాయి. ఇప్పటికే 6.50 కోట్ల మంది రైతులు ఆధార్-పాన్-బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్నారు.
కేంద్రం పీఎం కిసాన్ రైతు బంధు సాయం కోసం 75వేల కోట్ల సాయం బడ్జెట్ లో పెట్టింది. కానీ కేవలం 45వేల కోట్లు మాత్రమే రైతుల అకౌంట్ల లో పడ్డాయి. ఇక 40శాతం బడ్జెట్ నిధులు మిగిలి పోయాయి. పశ్చిమ బెంగాల్ లో 70లక్షల మంది రైతులున్నా.. అక్కడి సీఎం మమతా ఈ పథకాన్ని వ్యతిరేకిస్తోంది. యూపీ లో 50 లక్షల మంది డేటా అందలేదు. దేశవ్యాప్తంగా పలువురి డేటా లేక మోడీ సర్కారు డబ్బులను రైతుల ఖాతాల్లో వేయలేక పోతోంది.