Begin typing your search above and press return to search.

మోడీ పంపిన సాయం ఎంతంటే..

By:  Tupaki Desk   |   20 Nov 2016 3:28 PM GMT
మోడీ పంపిన సాయం ఎంతంటే..
X
మిగిలిన ప్రధానమంత్రులకు.. నరేంద్రమోడీకి ఒక తేడా ఉంది. ఆయన చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అన్ని అంశాల మీద రియాక్ట్ అవుతూ ఉంటారు. మరో ఆసక్తికర కోణం ఏమిటంటే.. ఎంత వేగంగా రియాక్ట్ అవుతారో.. అంతే మొండిగా కొన్ని విషయాలు తనకేమాత్రం సంబంధం లేనట్లుగా ఉండిపోతారు. చిన్న ఉత్తరం ముక్క రాసినా స్పందించేటట్లుగా ఉండే మోడీ వైఖరి ఆసక్తికరంగా ఉంటుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆయన సామాన్యులు ఎవరైనా సాయం అందించాలంటే చాలు సానుకూలంగా స్పందించే గుణం ఆయన సొంతం. తాజాగా తాను ప్రకటించిన నోట్ల రద్దు నేపథ్యంలో.. దేశ వ్యాప్తంగా ప్రజలకు కరెన్సీ కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక.. వివాహాలు లాంటి వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్న వారి ఇబ్బందులు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నట్లుగా పరిస్థితి మారింది. ఇంట్లో పెళ్లి జరుగుతున్న వాళ్లు కానీ తమ శుభలేఖల్ని బ్యాంకుల్లో చూపించి అండర్ టేకింగ్ ఇస్తే వారికి రూ.2.5లక్షల మేర నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉన్నట్లుగా కేంద్రం ప్రకటించింది.

అయితే.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. శుభలేఖల్ని తీసుకొని బ్యాంకులకు వెళుతున్న వారికి.. బ్యాంకు సిబ్బంది తమ సమాధానంతో షాకిస్తున్నారు. కేంద్రం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని.. తాము ఏమీ చేయలేమని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకున్న ఇబ్బందుల గురించి ప్రధాని మోడీకి.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గానికి చెందిన పెళ్లికుమార్తె ఒకలేఖ రాశారు.

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో డబ్బులకు చాలా ఇబ్బందిగా మారిందని.. డబ్బులు దొరకటం లేదని పేర్కొంది. తనను ప్రధాని మోడీనే ఆదుకోవాలని కోరింది. ఆమె లేఖ రాసిన తీరుకు స్పందించిన ఆయన.. లేఖ అందిన తొమ్మిది రోజుల తర్వాత ఆమె ఇంటికి వెళ్లిన జిల్లా అధికారులు ఆమెకు రూ.20వేల మొత్తాన్ని అందించారు. ప్రధాని లేఖ చదివారని.. ఆమెకు సాయం పంపినట్లుగా పేర్కొనటంతో.. పెళ్లి ఎలా అని దిగులుతోఉన్న జితేంద్ర సాహు కుటుంబం సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోవటమే కాదు.. సామాన్యుడు రాసే లేఖలకు ప్రధాని సైతం స్పందిస్తున్నారని తెగ సంతోషపడిపోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/