Begin typing your search above and press return to search.
మోడీ చేసిన పనికి లోక్ సభ షాకయ్యింది
By: Tupaki Desk | 16 Dec 2015 9:16 AM GMTపార్లమెంటులో ఈ రోజు అద్భుత సన్నివేశం ఆవిష్కృతమైంది. ప్రధాని తీరుకు వ్యతిరేకంగా గొంతు చించుకుంటూ మండిపడుతున్న ప్రతిపక్ష ఎంపీ చివరకు గొంతెండి ఇబ్బంది పడి నీళ్ల కోసం చూస్తుంటే... అంతవరకు ఆరపణలు - విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాన మంత్రే ఆయనకు మంచినీళ్లు అందించారు. ఆ వెంటనే ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని అభినందపూర్వకంగా నవ్వుకుంటూ మళ్లీ ఎవరి పనిలో వారు పడ్డారు. ఈ సంఘటన పార్లమెంటులో, బయట సభ్యుల మధ్య చర్చనీయాంశమైంది.
ఢిల్లీలో ఐఏఎస్ అధికారి అవినీతిపై దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఏకంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లోనే సోదాలు చేయడంపై ఆయన పార్టీ ఆప్ కు చెందిన ఎంపీలు లోక్ సభలో ఆందోళన చేశారు. పెద్ద ఎత్తున నినాదులు చేశారు. ప్రధాని మోడీ తీరు ఎమర్జెన్సీని తలపిస్తోందంటూ స్పీకరు పోడియంను చుట్టుముట్టారు. ఆ సమయంలో ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) ఎంపీ భగవంత్ మాన్ నినాదాలు చేస్తూ చేస్తూ అసౌకర్యానికి గురయ్యారు. గొంతు తడారిపోయి ఇబ్బందిపడ్డారు. వెంటనే మంచినీళ్ల కోసం అటూఇటూ చూశారు. ఆయన ఇబ్బందిని అర్థం చేసుకున్న ప్రధాని మోడీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన టేబుల్ మీద ఉన్న నీళ్లను తాగమని మాన్ కు అందించారు. వెంటనే మాన్ నీళ్లను గటగటా తాగి గ్లాసు తిరిగి టేబుల్ మీద పెట్టారు. ఈ సందర్భంగా మోడీ - మాన్‌లిద్దరూ నవ్వులు చిందించారు. ఈ సన్నివేశాన్ని చూసి బిజెపి సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. మంచినీళ్లు తాగిన వెంటనే యధావిధిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మాన్ తన ఆందోళనను కొనసాగించారు. మోడీ కూడా మౌనంగా చూస్తూ ఉన్నారు. ఈ సంఘటన లోక్ సభను ఆకట్టుకుంది.