Begin typing your search above and press return to search.
మోదీజీ.. మధ్య తరగతికి మతం లేదు
By: Tupaki Desk | 1 Feb 2018 4:36 PM GMTమోదీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు బోల్తాపడినట్లుగా కనిపిస్తోంది. మతాలవారీ ఓట్ల లెక్కలతో ఒక్కో ఎన్నికనూ గెలుచుకుంటూ వెళ్తున్న మోదీ సర్కారు ఆ లెక్కల్లో పడి సమాజంలోని ఆర్థిక వర్గాలను విస్మరించినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా మధ్య తరగతి అనే అతి పెద్ద వర్గాన్ని మర్చిపోయిందని తాజా బడ్జెట్ చెప్తోంది. ఆ మతిమరుపు ప్రభావం వచ్చే ఎన్నికల్లో మోదీపై ప్రభావం చూపొచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి. మధ్య తరగతికి మతం లేదని... వారికి నష్టం కలిగిస్తే ఎవరైనా నష్టపోక తప్పదని గత అనుభవాలు గుర్తుచేస్తున్నాయి.
2014 ఎన్నికలకు ముందు నుంచి మోదీపై మోజు పడిన భారతీయ మధ్యతరగతి ఆ తరువాత మోదీ కొన్ని ఝలక్ లు ఇచ్చినా కూడా తమ ప్రేమను చంపుకోలేదు. ముఖ్యంగా పెద్ద నోట్లను రద్దు చేసి బ్యాంకులు - ఏటీఎంల ముందు ఎండలో నిలబెట్టినా.. అన్నిటికీ ఆధార్ కు లింకు పెట్టి సహనాన్ని పరీక్షిస్తున్న భరిస్తున్న మధ్య తరగతి తాజా దెబ్బతో మోదీపై మండిపడుతోంది. ముఖ్యంగా అన్నిటికీ పాన్ కార్డు - ఆధార్ కార్డులను ముడిపెట్టి.. తాము సంపాదించే ప్రతి పైసా లెక్కను తెలుసుకుని ముక్కుపిండి ఆదాయ పన్ను వసూలు చేస్తున్న మోదీ ప్రభుత్వం తమనుంచి మరింత పిండే ప్రయత్నం చేయడమే తప్ప పన్ను శ్లాబుల్లో కొంచెం కూడా మార్చకుండా.. కనీసం 80సీ ద్వారా పన్ను మినహాయింపు అవకాశం కూడా పెంచకపోవడంతో మధ్యతరగతి మండిపడుతోంది. పైగా తమను పట్టించుకోకుండా కార్పొరేట్ టాక్సులు తగ్గించడం వారిని మరింత బాధిస్తోంది.
దీంతో గత నాలుగేళ్లుగా మోదీని ఎంతగానో ఇష్టపడి అచ్చేదిన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న మధ్యతరగతి ఈ బడ్జెట్ దెబ్బతో బీజేపీకి దూరమవుతోంది.
పైగా జైట్లీ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన ముహూర్తం ఏమిటో కానీ బడ్జెట్ భారతదేశ పేద - మధ్య తరగతి ప్రజలను నిరాశపెట్టడమే కాకుండా - ఇదే రోజున కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ లో బై ఎలక్షన్లో మూడు సీట్లు గెలుచుకోవడంతో ఇది మోదీ పతనానికి నాంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో బీజేపీ భవిష్యత్తుపై సెటైరికల్ పోస్టింగులు వెల్లువెత్తుతున్నాయి.