Begin typing your search above and press return to search.
ఏపీకి మోడీ ఇచ్చిందేంటి? అప్పుడు మట్టి-నీళ్లు.. ఇప్పుడు పొగడ్తలు!!
By: Tupaki Desk | 4 July 2022 3:44 PM GMTనిత్యం అత్యంత బిజీగా ఉండే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీకి వచ్చారు. రెండోసారి ప్రధాని అయిన తర్వాత.. అంటే.. జగన్ సీఎం అయిన తర్వాత ప్రధాని ఏపీకి రావడం బహుశ ఇదే తొలిసారి. పశ్చిమ గోదావరి జిల్లా బీమవరంలో నిర్వహించిన మన్యం వీరుడు.. అల్లూరి 125వ జయంతిలో ఆయన పాల్గొన్నారు. అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే.. సాధారణంగా దేశాన్ని పాలించే రాజు.. రాష్ట్రానికి వస్తే.. సహజంగానే ప్రజలు కొన్ని కొన్ని ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ప్రస్తావిస్తారని.. వాటి పరిష్కారానికి ఏదైనా ప్రకటన చేస్తారని అనుకుంటారు.
అలాగే..ఏపీ ప్రజలు భారీ భారీ ఆశలు పెట్టుకోలేదు. ఏవో చిన్న చిన్న ఆశలు అయితే.. ఉన్నాయి. ప్రధానంగా.. పోలవరం ప్రాజెక్టు గురించి, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీ కరణ కాకుండా చూడడం, కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం, వెనుకబడిన జిల్లాల అభి వృద్ధితో పాటు.. రాష్ట్రంలో పేరుకుపోయిన అప్పుల నుంచి ఎలా బయట పడాలనే అంశాలపై ప్రధాని కొన్ని సూచనలు చేస్తారని.. ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తారని భావించారు. కానీ, ప్రధాని మోడీ ఇలా వచ్చారు.. అలా వెళ్లారు. ఈ కొద్ది సేపట్లో ఆయన ఏపీని పుణ్యభూమి అన్నారు. అల్లూరిని ధన్య జీవి అన్నారు.
అల్లూరి కుటుంబ సభ్యులను సత్కరించారు. దణ్నాలు పెట్టారు.. పాదిభివందనం చేశారు. తన మాటల విన్యాసం మొత్తం ప్రద ర్శించారు. ఆంధ్ర రాష్ట్రం ఎందరో దేశభక్తులకు పురుడు పోసిన గడ్డ. పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, పొట్టి శ్రీరాములు, వీరేశలింగం పంతులు వంటి మహానుభావులను కన్న భూమి ఏపీ అన్నారు. దేశం కోసం బలిదానం చేసిన ఇలాంటి వారి కలలను సాకారం చేయాలి. ఈ బాధ్యత అందరిపైనా ఉందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. అయితే.. అందరి విషయం పక్కన పెడితే.. ఏపీపై కేంద్రానికి ఉన్న బాధ్య త ఏంటి? అనేది ముఖ్యం.
ఎందుకంటే.. ఏపీకి ఇప్పటి వరకు మోడీ హయాంలో ఇచ్చింది ఏమీ కనిపించ డం లేదు. కనీసం.. రాజధాని అమరావతికి ఆయన తన చేతులతో శంకు స్థాపన చేశారు. అప్పట్లో చంద్రబాబు ఎంతో ఆశతో ప్రధాని మోడీని ఆహ్వానిస్తే.. ఆయన కేవలం మట్టీ, నీళ్లు తీసుకువచ్చి.. శంకుస్థాపన చేసి చేతులు దులుపుకొన్నారు. కనీసం.. ఇన్నేళ్లయినా.. ఏపీ రాజధాని ఎలా ఉందని ఆరాతీసిన పాపాన పోలేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఉంచేశారు. ఇక, పోలవరం ప్రాజెక్టుతో ఇదే ఆదివాసీ గ్రామాలు.. నియోజక వర్గాలకు నీరు పుష్కలంగా అందుతుంది. కానీ, ఈ ప్రాజెక్టును కూడా ముందుకు సాగకుండా.. అడ్డుకుంటున్నారు.
దీనిపైనా మోడీ మౌనంగానే ఉన్నారు. వెనుక బడిన జిల్లా ల అభివృద్ధికి కేంద్రం నుంచి ఎలాంటి సాయం ఉంది? అనేది మరో ప్రశ్న. మరీ ముఖ్యంగా విభజన తర్వాత.. ఏర్పడిన విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని కూడా.. పరిష్కరించలేదు. కనీసం.. నీటి వివాదాలు.. ఆస్తుల విభజన ఉద్యోగుల విభజన వంటి అనేక అంశాలు ఇప్పటికీ.. వివాదంగానే ఉన్నాయి. అప్పులు పేరుకుపోతున్నాయి. జల వివాదాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. అయినా.. మోడీ వాటిని ప్రస్తావించలేదు.
కేవలం.. ఏపీని పుణ్యభూమి, ధన్య భూమి అని అన్నంత మాత్రాన.. ఏపీ ప్రజలకు ఒరిగింది ఏమిటి? అన్నది ప్రశ్న. కనీసం..ఇప్పటికైనా.. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకుని.. పరిష్కరిస్తే.. రాజధాని.. పోలవరం.. ప్రత్యేక హోదా.. వంటి అంశాలపై ఒక పరిష్కారం చూపిస్తే.. అదే ఏపీ ప్రజలకు.. మోడీ మేలు చేసినట్టు అవుతుంది. కానీ, ఇవేవీ పట్టించుకోకుండానే మోడీ.. మరోసారి మాటలు చెప్పి.. చేతులు దులుపుకొని వెళ్లిపోవడం.. ఆశావహులను తీవ్ర నిరాశలో ముంచేసింది.