Begin typing your search above and press return to search.
మోడీ గ్రేట్ బాస్..బాదుడ్ని పండగ చేసేశాడు
By: Tupaki Desk | 2 July 2017 4:32 AM GMTఏమైనా ప్రధాని మోడీ.. మోడీనే. భారం పడుతుందంటే ఫీలయ్యే జనాలను పండగ చేసుకునేలా చేయటంలో మోడీ తెలివిని మెచ్చుకోవాల్సిందే. జీఎస్టీ అంటూ.. పన్ను పేరు వినిపించని పొట్టి పేరుతో అందరికి దగ్గరైన ఆయన.. ఒకే దేశం ఒకే పన్ను అంటూ ట్యాగ్ లైన్ పెట్టి ఫేమస్ చేసేశారు.
సాధారణంగా ప్రభుత్వం ఏదైనా.. పన్నుల విధానాన్ని తెర మీదకు తెస్తే.. దానిపై ప్రజల్లో కొత్త సందేహాలు.. సరికొత్త అనుమానాలు తలెత్తటం మామూలే. ఇలాంటి వేళ.. నిరసనలు.. ఆందోళనలు వెల్లువెత్తుతుంటాయి. కానీ.. అలాంటి పరిస్థితి తలెత్తకుండా పన్నుల వడ్డన కార్యక్రమం ఒక పండగ మాదిరి చేయటం మోడీకి మాత్రమే చేతనైందని చెప్పక తప్పదు.
పన్ను అంటే.. ప్రజల జేబులో నుంచి డబ్బులు తీసుకోవటం లాంటిది. అది ఎంత తక్కువగా ఉంటే ప్రజలకు అదంత ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కానీ.. మోడీ సర్కారు అమలు చేస్తున్న సరికొత్త వస్తు సేవల పన్ను విధానంలో సామాన్యులకు.. మధ్యతరగతికి మేలు కలిగించే అవకాశం తక్కువే. అయినప్పటికీ.. జీఎస్టీ వల్ల ఏదో ప్రయోజనం జరగనుందన్న భావన కలిగించటంలో మోడీ సర్కారు సక్సెస్ అయ్యిందని చెప్పక తప్పదు.
నిత్యం వినియోగించే పప్పుల విషయంలో కాస్తంత కనికరం ప్రదర్శించినట్లు కనిపించినా.. నిత్యవసరాలు అయినా.. ప్యాకింగ్ రూపంలోకి వస్తే బాదుడు తప్పదన్న పాయింట్ ను పెట్టేయటం ద్వారా జీఎస్టీ ప్రయోజనం పరిమితమన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.
అయినప్పటికీ.. జీఎస్టీతో ఏదో లాభం జరిగిపోనుందన్న భావన కలిగించటం.. పన్నుల వసూలుకు మొదలెట్టిన సరికొత్త విధానం చారిత్రకం అంటూ పండుగ చేయటం మోడీకి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి. దేశం ఏదైనా కొత్త పన్నుల చట్టాన్ని తీసుకొస్తున్నామని చెబుతూ.. పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఏకంగా వేడుక నిర్వహించటం మోడీకి మాత్రమే సాధ్యమవుతుంది. ఒకవేళ.. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త పన్నుల చట్టం ప్రపంచంలోని మరే దేశంలో లేనంత తక్కువకే పన్నుల వడ్డనను డిజైన్ చేసినా.. ఈ తరహా వేడుకలు నిర్వహించటానికి అర్హులని చెప్పాలి. కానీ.. అలాంటిదేమీ లేకుండా దేశ ప్రజల వీపు మీద విమానం మోత మోగించేలా పన్ను రేట్లను సెట్ చేసి మరీ పండుగ చేయటం మోడీకి మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/