Begin typing your search above and press return to search.
మోడీ స్వరం మారింది గమనించారా?
By: Tupaki Desk | 25 Dec 2016 5:30 PM GMTమోడీ సంస్కరణవాదా.. రాజకీయవాదా.. సంస్కరణవాద ముసుగులో ఉన్న అసలు సిసలు రాజకీయ నాయకుడా? వీటన్నింటిలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలోనూ.. ప్రధానిగా మారిన తొలినాళ్లలోనూ మోడీ కచ్చితంగా సంస్కరణవాదే.. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలు నమ్మింది కూడా అదే! ఆ సమయంలో మోడీ అంటే తెలియని వారంతా ప్రధాని హోదాలో మోడీని చూడటానికి కారణం ఒకటే. ఆయన్ని అంతా బీజేపీ నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా, మాస్ లీడర్ గా చూడలేదు. గుజరాత్ అభివృద్ధి కోణంలో మాత్రం చూశారు.. ఆ సమయంలో ప్రజలందరికీ కనిపించింది మోడీలో ఉన్న సంస్కరణవాది మాత్రమే. ఈ ఆలోచనే మోడీని గతంలో ఏ ప్రధానికీ రాని స్థాయిలో అవకాశం వచ్చేలా చేసింది.
అయితే తాజాగా మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం - అనంతర పరిణామాలు మోడీలో ఉన్న సంస్కరణవాదిని కనుమరుగుచేస్తుందనే అభిప్రాయం ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతుంది! ప్రతీ విషయాన్ని సంస్కరణ కోణంలో చూసే మోడీ తాజాగా ప్రతీ విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారనే విమర్శలు అధికంగా వినిపిస్తున్నాయి. దానికి కారణం నోట్ల రద్దు విషయంపై ఎదురైన విమర్శలు - సలహాలు సూచనలకు మోడీ స్పందిస్తున్న విధానమే!
రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కొట్టిపారేస్తే అర్ధం చేసుకోవచ్చు.. కానీ మన్మోహన్ సింగ్ చెప్పిన మాటలకు కూడా పెడార్థాలు తీస్తే అది ప్రజలకు ఎలాంటి సంకేతాన్ని ఇస్తుందనే విషయం మోడీ మరిచిపోకూడదు. ఇదే సమయంలో చిదంబరం చెప్పినట్లుగా సుమారు 50% గ్రామాల్లో ఇప్పటికీ కరెంటు లేకపోవడం, ఇంటర్నెట్ సౌకర్యాల గురించి ఆలోచించకపోవడం వంటి సమస్యలున్న తరుణంలో నగదు రహితం అనే విషయం అసాధ్యం అనే భావన వ్యక్తపరుస్తున్నారు. వీటిలో రాజకీయంగా వారి వారి సలహాలనో విమర్శలనో సునాయాసంగా తిప్పికొట్టిన మోడీ... ఆ సమస్యలపై మాత్రం తనదైన సంస్కరణవాద సమాధానం కానీ పరిష్కారం కానీ తన మనసులో ఉన్న ఆలోచన కానీ వారికి సమాధానంగా కాకపోయినా, ప్రజలకు దైర్యం చెప్పడానికైనా చెప్పి ఉంటే బాగుండేది! ఈ విషయంలో నోట్ల రద్దుకు సంబందించి ఎవరు చేసే విమర్శలను అయినా సూచనలుగా బావించి జాగ్రత్తపడి ఉంటే ఈ సమస్య ఈ స్థాయిలో వచ్చి ఉండేది కాదనేది విశ్లేషకుల అభిప్రాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/