Begin typing your search above and press return to search.
నార్త్ మీద మోడీకున్న లవ్ ఎంతంటే..
By: Tupaki Desk | 8 Feb 2017 4:42 AM GMTఉన్నది ఉన్నట్లు చెబితే కాస్త చిరాగ్గా ఉంటుంది. తమ రాజకీయ వ్యూహాలన్ని బట్టబయలు చేసే నేతలన్నా.. వారి మాటలన్నా అధికారంలో ఉన్న వారికి మా చెడ్డ చిరాగ్గా ఉంటుంది. దీనికి తోడు భావోద్వేగ అంశాల్ని జత చేస్తే ఆ మంట మరింత ఎక్కువగా ఉంటుంది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ప్రసంగాల్లో ప్రతిసారీ మోడీ ఉత్తరాది ప్రేమను అదే పనిగా ప్రస్తావించటం వెంకయ్య లాంటి వారికి చిరాకు తెప్పించేస్తోంది.
ఎందుకంటే.. ఈ తరహా మాటల్ని మొదలు పెట్టినప్పుడు అంతగా ఆదరణ ఉండదు. కానీ.. అందులోని వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకోవటం మొదలు పెట్టిన తర్వాత నుంచి ఎన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయో కేంద్రమంత్రి వెంకయ్యకు బాగానే తెలుసు. భావోద్వేగ అంశాలతో రాజకీయాల్లోకి వచ్చి.. ఈస్థాయికి వచ్చిన పెద్దమనిషికి.. పవన్ లాంటి వారి నోటి నుంచి వచ్చే పవన్ ఫుల్ మాటల పర్యవసానం బాగానే తెలుసు.
అందుకే.. ఉత్తరాది.. దక్షిణాది లాంటి మాటలేంటి? అంటూ ఆయన ఈ మధ్య అవకాశం వచ్చిన ప్రతిసారీ మండిపడుతున్నారు. అయితే.. పవన్ చెప్పే మాటల్లో నిజం లేదని చెప్పలేం. అయితే.. ఇప్పటివరకూ ఆయన వినిపించిన వాదనకు జత చేసే ఒక లెక్కతాజాగా బయటకు వచ్చిందని చెప్పాలి. కేంద్రం అమలు చేస్తున్న కీలకమైన పథకాల్లో దేశంలోని మిగిలిన ప్రాంతాల్ని పక్కన పెట్టి.. ఉత్తరాదిగా.. అందునా బీజేపీ పట్టున్న ప్రాంతాల్లో అమలు చేస్తున్న వైనం చూస్తే ఆశ్చర్యం కలగటమే కాదు.. పవన్ చెప్పిన మాట నిజమనిపించక మానదు.
పేదలకు ఉచితంగా వంట గ్యాస్ అందించేందుకు ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ను ఇచ్చారు. ఇలా కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉన్నవి మొత్తం ఉత్తరాది రాష్ట్రాలే కావటం గమనార్హం. తాజాగా ఎన్నికలు జరుగుతున్న యూపీకి పెద్దపీట వేసేలా కేంద్రం కనెక్షన్లను జారీ చేయటం గమనార్హం. ఈ గ్యాస్ కనెక్షన్లలో ఉత్తరప్రదేశ్ కు 46 లక్షలు ఇస్తే.. పశ్చిమబెంగాల్ కు 19 లక్షలు.. బీహార్ కు 19లక్షలు.. మధ్యప్రదేశ్ కు 17 లక్షలు.. రాజస్థాన్కు14లక్షల కనెక్షన్లు అందించటం గమనార్హం.తూర్పున ఉన్న పశ్చిమబెంగాల్ నువదిలేస్తే.. మిగిలిన అత్యధిక కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రాలు ఉత్తరాదివే. ఉత్తరాది.. దక్షిణాది ఒకటే అయితే.. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కటంటే ఒక్క రాష్ట్రంలోనూ అత్యధిక కనెక్షన్లు ఎందుకు లేనట్లు..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/