Begin typing your search above and press return to search.

మోడీని వెంక‌య్య మ‌ళ్లీ ఎత్తేశాడు బాబోయ్‌

By:  Tupaki Desk   |   3 Jun 2016 5:01 PM GMT
మోడీని వెంక‌య్య మ‌ళ్లీ ఎత్తేశాడు బాబోయ్‌
X
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మ‌రోమారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేశారు. అవ‌కాశం దొరికితే చాలు మోడీ దైవ‌దూత అని అకాశానికి లేపేసే నాయుడుగారు త‌న విదేశీ ప‌ర్య‌ట‌న ముగించుకొని వ‌చ్చిన త‌ర్వాత మ‌ళ్లీ అదే ప‌నిచేశారు. ప్రపంచంలోనే టాప్ 10 నేతలలో మోడీ ఒక‌ర‌ని పేర్కొంటూ ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేసేవారు దీన్ని గ్ర‌హించాల‌ని అన్నారు.

అంతర్జాతీయ నేతగా మారిన మోడీ వ‌ల్లే ఐక్యరాజ్యసమితి యోగా డేని అధికారికంగా గుర్తించి నిర్వ‌హిస్తున్న‌ద‌ని - బ్రిక్స్‌ బ్యాంకుకు తొలిసారి భారతీయుడు ఛైర్మన్‌ అయ్యారని వెంక‌య్య నాయుడు కొనియాడారు. ఇలా ప్ర‌పంచం అంతా గుర్తించిన ప్ర‌ధాన‌మంత్రిని ప్ర‌తిప‌క్షాలు కేవ‌లం రాజ‌కీయం కోస‌మే విమ‌ర్శించ‌డం త‌గ‌ద‌ని ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. మోడీ ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్నందున భారత‌దేశాన్ని ప్రపంచం అంతా గుర్తించి త‌మ దేశానికి రావాలంటూ ఎర్ర‌తివాచి ప‌రుస్తోంద‌ని చెప్పారు. దేశీయ అభివృద్ధికి విధానాలు రూపొందిస్తూ..విదేశాల‌ను ప్ర‌భావితం చేస్తున్న ప్ర‌ధాన‌మంత్రిని అభినందించ‌డం పోయి విమ‌ర్శించ‌డం స‌రికాద‌ని వెంక‌య్య‌నాయుడు వ్యాఖ్యానించారు.