Begin typing your search above and press return to search.

తమిళంపై మోడీ కరెక్షన్..

By:  Tupaki Desk   |   30 Sep 2019 11:28 AM GMT
తమిళంపై మోడీ కరెక్షన్..
X
కేంద్ర హోమంత్రి అమిత్ షా ఇటీవల హిందీని దేశభాషగా చేద్దామని పిలుపునివ్వగానే మొదట స్పందించి ఆగ్రహించింది తమిళులే.. తాము తమిళం తప్ప హిందీ వాడమంటూ తమిళ రాజకీయ పార్టీలు, నేతలు, సాధారణ పౌరులు గళమెత్తారు.

అయితే ఆ దుమారం రేపిన నేపథ్యంలోనే రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి తమిళనాడులో ప్రధాని నరేంద్రమోడీ పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మోడీ ఈ సందర్భంగా తమిళ భాషపై కామెంట్ చేశారు. దేశంలోనే కాక ప్రపంచంలోనే తమిళ భాష చాలా ప్రాచీనమైనదని.. ఉన్నతమైనదని ప్రధాని మోడీ చెప్పుకొచ్చాడు. ప్రపంచంలోనే తమిళ భాషకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. తమిళ భాషకు చాలా చారిత్రాత్మక, ప్రత్యేక గుర్తింపు ఉందని.. అందుకే తాను ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించినప్పుడు తమిళ పదాలను వాడానని మోడీ గుర్తు చేసుకున్నారు.

ఇక ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే పర్యావరణ పరిస్థితులపై మోడీ వివరించారు. వన్ టైం ప్లాస్టిక్ వస్తువుల వాడకంపై పూర్తిగా నిషేధం విధించాలని మోడీ పిలుపునిచ్చారు. ప్రజలంతా దీన్ని ఉద్యమంలా భావించాలని మోడీ కోరారు.