Begin typing your search above and press return to search.
సుజనాకు బాబు గ్రీన్ సిగ్నల్..మోడీ రెడ్ సిగ్నల్
By: Tupaki Desk | 8 May 2016 6:30 AM GMTకొద్దికాలంగా టీడీపీ యువనేతతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో కేంద్రమంత్రి సుజనా చౌదరికి ఈసారి రాజ్యసభ సభ్యత్వంపొడిగింపు, కేంద్ర మంత్రి వర్గంలో కొనసాగింపు విషయంలో చంద్రబాబు ఆసక్తిచూపని సంగతి తెలిసిందే. అయితే.. ఏమైందో ఏమోకానీ, చంద్రబాబు మనసు మళ్లీ మారిందట. సుజనాకు రాజ్యసభ సీటు ఇవ్వాలని అనుకుంటున్నారట. అంతేకాదు కేంద్ర మంత్రివర్గంలోనూ ఆయన్నే కొనసాగించాలని భావిస్తున్నారట. కానీ, సుజనా దురదృష్టం ఏమో కానీ చంద్రబాబు ఓకే అనేటప్పటికీ మోడీ మొండిపట్టు మొదలైంది. త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో సుజనాను తప్పించబోతున్నట్లు చంద్రబాబుకు సంకేతాలిచ్చారట. దీంతో కేంద్రమంత్రివర్గంలో సుజనా చౌదరిని కొనసాగించాల్సిందేనని చంద్రబాబు పట్టుబడుతున్నారట.
బ్యాంకుల నుంచి ఆర్ధిక అభియోగాలను ఎదుర్కొంటున్న సుజనాను మంత్రివర్గంలో కొనసాగించడం వల్ల, ఏన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వం అప్రతిష్టపాలు కావాల్సి వస్తుందని కమలనాథులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలోకి సుజనా చౌదరిని తీసుకునేందుకు, మొదటనే ప్రధాని తీవ్రంగా విముఖత ప్రదర్శిచింనట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటికే వివిధ ఆర్ధికాభియోగాలను ఎదుర్కొంటున్న సుజనాను మంత్రివర్గంలోకి తీసుకోవడం వల్ల , విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవల్సివస్తుందనిఆయన చంద్రబాబును సముదాయించారన్నారు. అయినా చంద్రబాబు పట్టుబట్టి సుజనాను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరడంతో - భాగస్వామ్య పార్టీ అధినేత మాట కాదనలేక మోడీ - సుజనాకు మంత్రివర్గంలో స్థానం కల్పించారని చెబుతున్నారు. అయితే మంత్రివర్గంలో చేరిన తరువాత కూడా సుజనాపై ఆర్ధికాభియోగాలు రెట్టింపు కావడంతో, త్వరలోనే జరిగే మంత్రి వర్గ విస్తరణలో ఆయన్ని తప్పించాలని మోడీ భావిస్తున్నారంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం సుజనాను మంత్రివర్గంలో కొనసాగించాల్సిందేనని పట్టుబడుతున్నారని కమలనాథులు చెప్పారు. సుజనాను మంత్రివర్గంలో కొనసాగించే విధంగా ప్రధానిపై ఒత్తిడి తీసుకువచ్చి తన పంతం నెగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు.
మరోవైపు సుజనా విషయంలో టీడీపీ సీనియర్ల కూడా అసంతృఫ్తిగానే ఉన్నారు. సుజనాను కొనసాగించాల్సిందేనని అధినేత పట్టుబట్టడం టీడీపీలోని సీనియర్లకు సైతం సుతారం నచ్చడం లేదు. సుజనా పార్టీకి చేసిన సేవలేమిటో, తమకైతే అర్ధం కావడం లేదని వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి సేవ చేసిన వారేందరో సీనియర్లు ఉండగా, పట్టుబట్టి ఆయనకే కేంద్రమంత్రి పదవి ఇప్పించిన చంద్రబాబు, ప్రస్తుతం ఆర్ధికాభియోగాలు ఎదుర్కొంటున్న తరుణంలో కూడా కొనసాగించాలని కోరడం అర్ధరహితమని ప్రైవేట్ సంభాషణాల్లో పేర్కొంటున్నారు. వచ్చేనెలతో రాజ్యసభ పదవి కాలం ముగియననున్న సుజనాను కేంద్రమంత్రివర్గం నుంచి తప్పించి, సీనియర్లకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. లేకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.