Begin typing your search above and press return to search.
సారీ చెప్పి సీరియస్ అయిన మోడీ!
By: Tupaki Desk | 11 Sep 2015 3:12 PM GMTప్రధాని మోడీకి సీరియస్ అయిపోయారు. తనను వీవీఐపీగా చూస్తూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయటం పట్ల ఆయన మండిపడుతున్నారు. తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో భద్రత పేరు చెప్పి చేస్తున్న హడావుడిపై గుర్రుగా ఉన్నారు. తాజాగా ఆయన చండీఘర్ పర్యటనకు వెళ్లారు.
ఈ సందర్భంగా తాను పర్యటించిన ప్రాంతంలో జన జీవనం స్తంభించిపోయిందన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన కోపానికి గురయ్యారు. అంతేకాదు.. తన కారణంగా ఇబ్బంది పడిన వారికి క్షమాపణలు చెప్పిన మోడీ.. మరోసారి అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. చంఢీఘర్ లో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా 180 స్కూళ్లను మూసేశారు. ఈ విషయం తెలిసిన మోడీ సీరియస్ అవుతున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తిస్తామని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన ట్వీట్ చేశారు. తన కారణంగా ప్రజలకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లుగా పేర్కొన్న మోడీ.. తనకు వీవీఐపీ ఏర్పాట్లు చేయటం ఇష్టం లేదన్న విషయాన్ని తాజాగా మరోసారి చెప్పినట్లు అయ్యింది.
చంఢీఘర్ లో తాజాగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ ను జాతికి అంకితం చేసిన సందర్భంగా ఈ హడావుడి అంతా చోటు చేసుకుంది. విపక్షాలు మేల్కొని.. విమర్శలు చేసే లోపే.. మోడీనే ఈ అంశాన్ని ప్రస్తావించటం గమనార్హం.