Begin typing your search above and press return to search.

భయంకర రోజు: ఆగస్టు 14ను గుర్తు చేసుకున్న మోడీ

By:  Tupaki Desk   |   14 Aug 2021 8:30 AM GMT
భయంకర రోజు: ఆగస్టు 14ను గుర్తు చేసుకున్న మోడీ
X
ఆగస్టు 15 భారత స్వాతంత్య్ర దినోత్సవ సంబురానికి దేశం యావత్తు సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్రమోడీ ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ ఒక కీలక ప్రకటన చేశారు. నాటి ఆగస్టు 14,1947 నాటి విభజన భయానక జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ‘భయానక జ్ఞాపకాల’ దినోత్సవంగా ఆగస్టు 14ను జరుపుకోవాలని భారత దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

భారత్ కు స్వాతంత్ర్యం ఇచ్చే ముందు బ్రిటీష్ పాలకులు.. అఖండ భారత్ ను రెండు ముక్కులుగా విభజించారు. పాకిస్తాన్ ను ముస్లిం రాజ్యంగా స్వతంత్ర దేశంగా మార్చారు. అప్పట్లో ఈ నిర్ణయం చాలా మందికి నచ్చలేదు.

ఈ విభజన సమయంలో ఇండియాలో ఉన్న చాలా మంది ముస్లింలు పాకిస్తాన్ కు.. పాకిస్తాన్ లోని హిందువులు చాలా మంది ఇండియాకు వలస వచ్చారు. ఇదంతా అప్పట్లో పెద్ద చారిత్రాత్మక అంశంగా మారింది. అదే సమయంలో భారత్ నుంచి వెళ్లిన వారు సురక్షింగా పాకిస్తాన్ చేరుకున్నారు.

అయితే పాకిస్తాన్ నుంచి భారత్ కు వస్తున్న వారిని చిత్రహింసలకు గురిచేశారు. ఆ భయానక రోజును దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోడీ ఈ కీలక ప్రకటన చేశారు.

ప్రతి సంవత్సరం ఆగస్టు 14న పాకిస్తా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటోంది. ప్రధాని మోడీ ఈ సందర్భంగా ట్వీట్ చేశాడు. ‘విభజన బాధలను ఎప్పటికీ మరిచిపోలేం. లక్షల మంది మన సోదర సోదరీమణులు తరలిపోవాల్సి వచ్చింది. చాలా మంది అప్పట్లో జరిగిన హింసలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి మన ప్రజల బాధలు, త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆగస్టు 14ను మనం విభజన భయానక జ్ఞాపకాల దినంగా జరుపుకుందాం’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశాడు.