Begin typing your search above and press return to search.

అయోధ్య తీర్పు పై మోడీ ఏమన్నారంటే ..?

By:  Tupaki Desk   |   9 Nov 2019 8:44 AM GMT
అయోధ్య తీర్పు పై మోడీ ఏమన్నారంటే ..?
X
వివాదాస్పద అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో పై సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. కాగా దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన రామజన్మభూమి కేసులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శనివారం కీలక తీర్పు వెల్లడించింది. వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించింది. అలాగే మూడు నెలల్లో అయోధ్య ట్రస్టును ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అయోధ్యలో ఐదెకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని తెలిపింది .

ఈ అత్యంత సున్నితమైన అయోధ్య కేసుపై సుప్రీం తీర్పుని దేశంలోని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. ఈ తీర్పుని ఇప్పటికే నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతించింది. అలాగే ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా సమన్వయం పాటించాలని కోరింది. ఇక తాజాగా ఈ అయోధ్య చారిత్రాత్మకమైన తీర్పు పై దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ స్పందించారు. కోర్టు తీర్పు ఒకరికి అనుకూలం, మరొకరికి వ్యతిరేకంగా చూడకూడదన్నారు. రామభక్తి.. రహీమ్ భక్తి ఏదైనా కావొచ్చు. ఇది భారతభక్తి చూపించాల్సిన సమయం అని ప్రధాని మోదీ తెలిపారు. దేశ ప్రజలు శాంతి, సౌభ్రాతృత్వంతో మెలిగి ఒక్కటిగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ తీర్పు ఏ ఒక్కరి గురించి అలోచించి ఇచ్చింది కాదు అని , అందరి అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోని ఇచ్చింది అని , ఈ తీర్పు తో న్యాయస్థానాలపై ప్రజలకి మరింత గౌరవం పెరుగుతుంది అని తెలిపారు.