Begin typing your search above and press return to search.
బాబుకు మరో అస్త్రమిచ్చిన మోడీ
By: Tupaki Desk | 4 Jan 2019 5:03 AM GMTచంద్రబాబు.. ఆయన అనుకూల మీడియా ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలియజెప్పే సంఘటన తాజాగా చోటుచేసుకుంది. అదేంటంటే చంద్రబాబు ప్రపంచ ఆర్థిక సదస్సుకు తన కుమారుడు లోకేష్ - మంత్రులు - మందీ మార్బలం మొత్తం 14 మందితో ప్రత్యేక విమానంలో వెళ్లడానికి రెడీ అయ్యారు. ఇప్పటివరకూ ఇలా పెట్టుబడుల కోసం సపరేట్ విమానాలను బుక్ చేసుకొని ఏపీ ఖజానాపై భారం మోపుతున్న చంద్రబాబు.. తిరిగి వచ్చేటప్పుడు ప్రకటనలు తప్పితే పరిశ్రమలు తీసుకురావడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. విమానం ఖర్చు బొక్క తప్పితే ఏం ఒనగూరడం లేదని ప్రతిపక్షాలు సైతం దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఇప్పుడు కూడా అదే పునరావృతం చేస్తున్నారు. చంద్రబాబు మొత్తం 14మందితో వెళ్తామని అనుమతివ్వమని కేంద్రానికి దరఖాస్తు చేశారట.. వాళ్లు నలుగురు మాత్రమే వెళ్లాలని.. 7 రోజులు వద్దు.. 4 రోజులు చాలు అని ఆంక్షలు విధించారట..
ఇకేంముంది తెలుగుదేశం అనుకూల మీడియాకు వార్త దొరికింది. ఏపీ పెట్టుబడుల కోసం చంద్రబాబు వెళుతుంటే కేంద్రంలోని మోడీ మోకాలడ్డుతున్నాడని.. అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని ప్రచారం మొదలు పెట్టాడు. బీజేపీపై నానా యాగీ చేస్తున్నారు. చంద్రబాబు ఊరుకుంటాడా.. రేపో మాపో ప్రెస్ మీట్ పెట్టి మోడీని విలన్ గా చూపిస్తాడు.
అయితే ప్రజలు మాత్రం బాబు అతి విదేశీ పర్యటనలను ఏవగించుకుంటున్నారు. ప్రతి సారి కోట్లు ఖర్చు పెట్టి విదేశీ పర్యటనలు చేస్తున్న బాబు.. రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదని ఈసడించుకుంటున్నారు. వీళ్ల భారీ డాబు దర్పం విదేశీ పర్యటనలతో ఇప్పటికే ఏపీ ఖజానాపై పెద్ద భారం పడుతోంది. నాలుగున్నరేళ్లుగా తిరుగుతూనే ఉన్నారు. మోడీ అయినా వీరి పర్యటనలకు బ్రేకు లేశాడు అంటూ జనం సంబరపడుతున్నారు.