Begin typing your search above and press return to search.

బ్రిక్స్ సదస్సులో మోడీ కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   17 Nov 2020 5:50 PM GMT
బ్రిక్స్ సదస్సులో మోడీ కీలక వ్యాఖ్యలు
X
ఐదుదేశాల ‘బ్రిక్స్’ సమావేశంలో ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు.ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని మోడీ గుర్తు చేశారు. చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు పాల్గొన్న ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

బ్రిక్స్ 12వ శిఖరాగ్ర సమావేశం మంగళవారం రాత్రి జరిగింది. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ సమావేశంలో భారత్ - బ్రెజిల్ - రష్యా - చైనా - దక్షిణాఫ్రికా అధ్యక్షులు/ప్రధానులు పాల్గొన్నారు.

బ్రిక్స్ సదస్సులో పాకిస్తాన్ పైనా.. అంతర్జాతీయ వ్యవస్థల తీరుపైన మోడీ మండిపడ్డారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలను సంస్కరించాలని కోరారు.

ప్రస్తుతం ఉగ్రవాదం ప్రపంచంలో అతిపెద్ద సమస్య అని.. ఉగ్రవాదానికి మద్దతునిచ్చే, నిధులు సమకూర్చే అన్ని దేశాలను జవాబుదారీ చేయాలని మోడీ కోరారు. మోడీ వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు పుతిన్ సమర్థించారు.

ప్రపంచ జనాభాలో 42 శాతం బ్రిక్స్ దేశాల్లో ఉందని, కోవిడ్-19 మహమ్మారి అనంతరం ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో ఈ దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని మోడీ చెప్పారు. పరస్పరం వాణిజ్యాన్ని పెంచుకునే అవకాశాలు చాలా ఉన్నాయని అన్నారు.

కరోనా నుంచి బయటపడే అంశంలో బ్రిక్స్ దేశాలు కీలక పాత్ర పోషించాయన్న మోడీ.. 150కి పైగా దేశాలకు భారత్ ఔషధాలను అందించిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యాక్సిన్ ను కూడా ప్రపంచదేశాలకు సరఫరా చేస్తామన్నారు. కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో బ్రిక్స్ దేశాలది కీలక పాత్ర అన్నారు.