Begin typing your search above and press return to search.

70వేల కోట్లు.. మోడీ నయా ప్లాన్

By:  Tupaki Desk   |   22 Jan 2019 7:57 AM GMT
70వేల కోట్లు.. మోడీ నయా ప్లాన్
X
ఇన్నాళ్లు పెట్టుబడిదారులు - పారిశ్రామికవేత్తల కోసం పనిచేసిన మోడీకి ఇన్నాళ్లకు రైతులపై కరుణ కలిగింది. మూడు రాష్ట్రాల్లో రైతులు కొట్టిన దెబ్బకు కళ్లుబైర్లు కమ్మి.. ఇప్పుడు వారికి మసిపూసి మారేడు కాయ చేసేందుకు కొత్త పథకాలతో మోడీ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవడమే ప్రధానంగా రైతు బంధు పథకాలకు శ్రీకారం చుడుతున్నారు.

కొద్ది రోజుల క్రితమే అగ్రవర్ణ పేదల కోసం రిజర్వేషన్ తీసుకొచ్చిన మోడీ సర్కార్ తాజాగా తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ గ్రాండ్ సక్సెస్ అయ్యి ఓట్ల వాన కురిపించిన నేపథ్యంతో ఈ పథకంపై కేంద్రం అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రైతు బంధు పథకం సాధ్యాసాధ్యాలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. దీనికోసం 70వేల కోట్లు అవసరమని తేల్చినట్టు సమాచారం. ఇక రైతులు పండించే పంటకు మద్దతు ధరపై కూడా కేంద్రం సబ్సిడీ ఇవ్వడానికి రెడీ అవుతోందట.. ఇలా పెల్లుబుకుతున్న రైతాగ్రాహాన్ని చల్లార్చేందుకు కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం.

ఇక రైతుబంధు పథకం తరహాలోనే మరో పథకం కూడా కేంద్రం రూపొందిస్తోందట.. ప్రస్తుతం అందిస్తున్న ఎరువుల రాయితీతోపాటు వ్యవసాయ సబ్సిడీలకు బదులుగా రైతుల ఖాతాల్లోకే నేరుగా నగదు జమ చేసి వారి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు మోడీ సర్కార్ ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రుణమాఫీ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో రుణమాఫీ మీదనే గెలిచిన దృష్ట్యా ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా విస్తరించి రుణమాఫీ చేసేందుకు నిర్ణయించినట్టు సమాచారం. ఇలా రైతన్నల అభిమానం కోసం మోడీ తన రూట్ మార్చినట్టు తెలుస్తోంది.