Begin typing your search above and press return to search.
మోడీ సాబ్.. ఎయిమ్స్ చీఫ్ కూడా చెప్పారు.. ఇప్పటికైనా నిర్ణయాన్ని ప్రకటిస్తారా?
By: Tupaki Desk | 2 May 2021 11:30 AM GMTఎవరేం చెప్పినా సరే.. మేం వినం. మాకంటూ కొన్ని అభిప్రాయాలు అంచనాలు ఉంటాయి. వాటికి శాస్త్రీయత ఏమిటి? హేతుబద్ధత ఏమిటన్న తొక్కలో ప్రశ్నలు వేయొద్దు. ప్రశ్నించొద్దని చెప్పామని.. సోషల్ మీడియాలో విమర్శించాలనుకుంటే.. మీ అకౌంట్లను బ్లాక్ చేస్తానన్నట్లుగా పాలకులు తీరు ఈ మధ్యన ఉండటం తెలిసిందే. చూస్తుండగానే.. రోజుకు నలభై.. యాభై వేల వరకు ఉండే పాజిటివ్ కేసులు రోజుకు నాలుగు లక్షల్ని దాటేశాయి. అయినప్పటికి దేశ వ్యాప్తంగా రెండు వారాల పాటు లాక్ డౌన్ విధించే విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు సిద్ధంగా లేరన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే పలుమార్లు లాక్ డౌన్ అవసరం లేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రధాని మోడీకి తగ్గట్లే కేంద్రంలోని కీలకమైన పెద్ద తలకాయలన్ని కూడా లాక్ డౌన్ అవసరం లేదన్న మాట మీదనే ఉన్నాయి. భారత్ లో పెరిగిపోతున్న కేసుల తీవ్రతను చూస్తున్న అమెరికా అంటువ్యాధుల నివారణ చీప్ ఫౌచీ లాంటోడు సైతం తక్షణమే భారత్ లో లాక్ డౌన్ అవసరమని చెబుతున్నారు.అయినప్పటికీ పాలకులకు ఇవేమీ పట్టటం లేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా కీలక వ్యాఖ్య చేశారు. దేశంలో పరిస్థితులు దయనీయంగా మారాయని.. ఆరోగ్య మౌలిక సదుపాయాల విషయంలో కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో కఠిన లాక్ డౌన్ అవసరమని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న రాత్రిపూట కర్ఫ్యూ.. వారాంత లాక్ డౌన్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉందని తేల్చారు. గత ఏడాది మార్చిలో ఏ రీతిలో అయితే లాక్ డౌన్ ను విధించారో.. సరిగ్గా అలాంటి లాక్ డౌన్ అవసరమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోందని..రానున్న రోజుల్లో మరింత తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో వైద్య సదుపాయాల కొరత ఏర్పడుతోందని.. దేశ రాజధానిలోని బాత్రా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక పన్నెండు మంది మరణించటం దీనికో ఉదాహరణగా ఆయన చెప్పారు. అందులో ఒక వైద్యుడు కూడా ఉండటం బాధాకరమన్న ఆయన.. సదరు డాక్టర్ తాను స్టూడెంట్ గా ఉన్నప్పటికి నుంచి తెలుసన్నారు.
మనలో చాలామంది తప్పుడు అభిప్రాయాలతో ఉన్నారని.. మనలో హెర్డ్ ఇమ్యూనిటీ ఉందని.. వైరస్ దరిచేదరన్న భావనలో ఉన్నామని.. అది తప్పన్న విషయాన్ని స్పష్టం చేశారు. వైరస్ లో మ్యుటేషన్ ఏర్పడితే హెర్డ్ ఇమ్యునిటీ ఆ వైరస్ ను తట్టుకోలేదని.. అప్పుడు మహమ్మారి కార్చిచ్చులా వ్యాపించి వినాశనానికి కారణమవుతుందన్నారు. మరి.. ఎయిమ్స్ చీఫ్ చెప్పిన మాటల్ని