Begin typing your search above and press return to search.
మోడీ మెచ్చిన మొనగాడు
By: Tupaki Desk | 17 Aug 2022 7:30 AM GMTఅప్పటికప్పుడు మారిపోయే వాతావరణం. వాతావరణ రుతు చక్రం సంబంధిత పరిణామాలు.. కాల గమనాలు, తిరోగామి పవనాలు, మాన్ సూన్ ప్రభావాలు ఇలా ఎన్నో .. అన్నింటి గురించి మాట్లాడే కుర్రాడు ఏపీ వెదర్ మ్యాన్.ఈ పేరు సామాజిక మాధ్యమాల్లో సంచలనం. అసలు ఫేస్బుక్ ను కానీ ట్విటర్ ను కానీ విపరీతంగా వాడేవారికి విపరీతంగా ఆలోచింపజేసే కుర్రాడు ఏపీ వెదర్ మ్యాన్.
ఎప్పటికప్పుడు తనదైన ప్రయత్నంతో, తనదైన సాంకేతికతో ప్రామాణికతకు తూగే విధంగా వాతావరణ సమాచారం అందించే ఈ కుర్రాడు ముఖ్యమయిన వేళల్లో మరింత అప్రమత్తమై ఆయా యంత్రాంగాలను అప్రమత్తం చేస్తున్న వైనం ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంది.
ముఖ్యంగా తీవ్ర తుఫానుల వేళ, వరదల వేళ ఆ కుర్రాడి పోస్టులు అస్సలు మిస్ కాకుండా పీఎంఓ సైతం ఫాలో అవుతోంది. ప్రముఖ మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం ప్రధాని మోడీ ట్విటర్ అకౌంట్ కూడా ఆయన్నే ఫాలో అవుతోంది. ఆయన అప్టేడ్స్ ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోమని ముఖ్య సందర్భాల్లో, ముఖ్యంగా విపత్తు వేళల్లో సంబంధి అధికారులను ఆదేశిస్తోంది. ఆ విధంగా ఏపీ వెదర్ మ్యాన్ తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఆయన్ను బీబీసీ తెలుగు ప్రతినిధి ఇటీవలే కలిశారు. ఇంతకూ ఆయన అసలు పేరు చెప్పనే లేదు కదూ ! సాయి ప్రణీత్. బతకడానికి బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే వెదర్ అప్టేడ్స్ ఇవ్వడంలో అధికార యంత్రాంగం కన్నా ముందుంటాడు. ఊరు - తిరుపతి. చదువు - బీటెక్. వ్యవసాయాధారిత ప్రాంతాల్లో ప్రజల కష్టాలు, సరిగా వాతావరణ సమాచారం అందక వారు పడుతున్న ఇబ్బందులు వీటన్నింటిపై మంచి అవగాహన ఉన్న కుర్రాడు.
బీబీసీ తనను కలిసి సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ..అసలెందుకు వాతావరణ సమాచారం తాను తెలుసుకుని ప్రజలకు చేరువ అయ్యేలా చేయాలనుకుంటున్నానంటే.. ఇక్కడ భిన్న వర్గాల ప్రజలు ఉంటారు. తుపాను వస్తుందంటే రైతుల వ్యవసాయ పనులు ఆగిపోతాయి. సమాచారంతో వారిని ముందుగా అప్రమత్తం చేస్తే వారు నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది అన్నారు.
మరికొందరు పట్టణాల్లో ఉండే వాళ్లు.. ఉదాహరణకు విశాఖపట్నంలో విపరీతమైన వరద రావచ్చు.. లేకపోతే తుపాను రావచ్చు.. అంటే ప్రజలు ముందుగానే అప్రమత్తం అవుతారు. వచ్చే రెండు, మూడు రోజులకు ఇచ్చే ఈ అంచనాలతో విశాఖ వాసులు దానికి తగ్గట్టు అప్రమత్తమవుతారు. ఇప్పుడు గోదావరిలో వరదొచ్చింది.. దాని గురించి అప్‌డేట్ ఇచ్చాను. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మన గ్రామం ముంపుకు గురి అయ్యే అవకాశం ఉందా? అనేవి భిన్న వర్గాలకు అర్థమయ్యేలా వివరంగా చెబుతాను. అని తెలిపారు. మొత్తానికి సమాజానికి అత్యంత విలువైన అవసరమైన సేవ చేస్తున్న ఈ కుర్రాడికి మంచి గుర్తింపే దక్కింది.