Begin typing your search above and press return to search.

బ్రిటన్ కు ఇచ్చిన షాకే.. జర్మనీకి ఇవ్వాల్సిన టైమొచ్చిందా?

By:  Tupaki Desk   |   4 Oct 2021 4:31 AM GMT
బ్రిటన్ కు ఇచ్చిన షాకే.. జర్మనీకి ఇవ్వాల్సిన టైమొచ్చిందా?
X
గతానికి భిన్నంగా వ్యవహరిస్తోంది భారత్ ప్రభుత్వం. సంపన్న దేశాలు తమకు తోచినట్లుగా నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. మన దేశంలో తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను గుర్తించే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జాగు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకున్నా.. దానిని గుర్తించేందుకు పలు దేశాలు నో చెబుతున్నాయి.

ఇదే రీతిలో వ్యవహరించిన బ్రిటన్ ప్రభుత్వానికి ఈ మధ్యనే మోడీ సర్కారు భారీ షాకివ్వటం తెలిసిందే. ఎంత చెప్పినా వినకుండా.. మొండిగా వ్యవహరిస్తున్న బ్రిటన్ కు దిమ్మ తిరిగిపోయేలా కేంద్రం ఇచ్చిన కీలక ఉత్తర్వుతో బ్రిటన్ నుంచి వచ్చే వారు ఎవరైనా సరే.. పది రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా జర్మనీ సైతం బ్రిటన్ తీరునే ప్రదర్శిస్తోంది. కొవాగ్జిన్ ను గుర్తించేందుకు నో చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తిస్తే తమకు అభ్యంతరం లేదని చెబుతోంది. కొవాగ్జిన్ ను జర్మనీ గుర్తించలేదని అందుకే.. ఆ టీకా తీసుకొని జర్మనీకి వచ్చిన వారు మళ్లీ కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని.. క్వారంటైన్ ఉండాల్సిందేనని స్పష్టం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను గుర్తిస్తే.. తాము కూడా ఈ విషయం మీద ఆలోచిస్తామన్నారు.

అప్పటివరకు కొవాగ్జిన్ ను తాము గుర్తించేది లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో కొవాగ్జిన్ రెండు డోసుల్ని వేయించుకున్న తర్వాత కూడా జర్మనీకి వెళితే పరీక్ష.. క్వారంటైన్ తప్పనిసరిగా మారింది. ఇలాంటి తీరును మార్చుకోవాలంటే.. ఈ మధ్యనే బ్రిటన్ కు ఇచ్చిన షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు. మరి.. మోడీ సర్కారు దీనిపై ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.