Begin typing your search above and press return to search.
మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆడాళ్ల ఆగ్రహం తప్పదా?
By: Tupaki Desk | 31 Oct 2019 4:22 AM GMTపెద్ద నోట్ల రద్దుతో సంచలన నిర్ణయాన్ని తీసుకున్న వేళ.. జాతి జనులు తీవ్ర ఇబ్బందులకు గురైనా.. మోడీ సర్కారుకు బాసటగా నిలిచారు. అవినీతి పందికొక్కుల లెక్క తేల్చేందుకు ఈ సంచలన నిర్ణయం సాయం చేస్తుందని భావించారు. అందులో భాగంగా తమ వంతు బాధ్యతగా పెద్ద నోట్ల రద్దు కష్టాల్ని అనుభవించేందుకు సిద్ధమయ్యారు. కానీ.. అనుకున్న దానికి.. అయిన దానికి తేడా ఏమిటన్నది అందరికి తెలిసిందే.
పెద్ద నోట్ల రద్దు కారణంగా సామాన్యులు మాత్రమే అష్టకష్టాలు పడ్డారు. దీని కారణంగా దేశానికి ఏదో మేలు జరుగుతుందన్న మాటకు భిన్నంగా.. అలాంటిదేమీ లేదని.. కొండను తవ్వి ఎలుకను తీసిన చందంగా పెద్దనోట్ల ఎపిసోడ్ సాగిందన్న విషయం పలువురి నోట వినిపించి.. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిచ్చింది.
ఇదిలా ఉంటే.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి అమ్మమొగుడు లాంటి నిర్ణయాన్ని మోడీ సర్కారు తీసుకునే దిశగా పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. ఎవరింట్లో ఎంత బంగారం ఉంది? అన్న విషయాన్ని లెక్క తేల్చాలన్న ఆలోచనలో కేంద్ర సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు. దీని కోసం నిర్దిష్ట గడువు విధించి.. ఆ లోపు వివరాలు చెప్పని వారిపై భారీగా ఫైన్లు విధించటంతో పాటు.. పరిమితికి మించి బంగారం ఉన్న వారిపై పన్ను వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే.. ప్రభుత్వ విధివిధానాలు ఎలా ఉండనున్నాయి? అన్న విషయం మీద మాత్రం స్పష్టత రాని పరిస్థితి. ఒకవేళ.. మోడీ సర్కారు కానీ.. ఈ నిర్ణయాన్ని తీసుకుంటే దేశ మహిళల ఆగ్రహావేశాలకు గురి కావటం ఖాయమంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. బంగారం దేశ మహిళలకు సెంటిమెంటు మాత్రమే కాదు.. తమ పొదుపును బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగిస్తారు. తమ పెద్ద వారు ఆస్తిగా.. కానుకలుగా ఇచ్చిన బంగారాన్ని లెక్కచూపించటం.. దానికి పన్నులు కట్టాల్సి రావటాన్ని జీర్ణించుకోలేరని చెబుతున్నారు.
బంగారం కొనుగోలుకు సంబందించిన రశీదు చూపించాలని.. లేకుంటే వారిపై జరిమానాలు విధించాలని మోడీ సర్కారు బావిస్తుంది. వివాహితలకు ఉండాల్సిన నగలు విషయంలో కొంత పరిమితి వరకూ వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ పథకాన్ని తీసుకొచ్చినంతనే.. తమ వద్ద ఉన్న బంగారం లెక్కను బయటపెట్టాల్సిందిగా ప్రభుత్వం కోరుతుందని.. అలా వివరాలు వెల్లడించిన తర్వాత.. నిర్వహించే ఆకస్మిక తనిఖీల్లో తాము చెప్పిన దాని కంటే ఎక్కువ బంగారం ఉంటే భారీ జరిమానాలు తప్పవంటున్నారు.
ఒకవేళ.. పరిమితికి మించిన బంగారం ఉన్నట్లు మొదటే ఒప్పుకుంటే.. అలాంటి వారికి కొంత పన్ను వేసి.. వారికి క్షమాభిక్ష పెడతారని.. ఆ తర్వాత కొనుగోలు చేసే బంగారం లెక్కలు మాత్రం పక్కాగా ఉండాల్సి ఉంటుందంటున్నారు. అయితే.. ఈ పథకం చెప్పినంత ఈజీగా అమలు కాదని.. ప్రాక్టికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయంటున్నారు. త్వరలో తెర మీదకు తేవాలని భావిస్తున్న ఈ బంగారు పథకం మోడీ సర్కారుకు ఎలాంటి తిప్పలు తెచ్చి పెడుతుందో చూడాలి.