Begin typing your search above and press return to search.
మోడీకి ‘బాహుబలి’ బాగా పట్టేసిందా?
By: Tupaki Desk | 28 Feb 2017 4:32 AM GMTతెలుగు సినిమా రేంజ్ ను మొత్తంగా మార్చేసిన చిత్రం ఏదైనా ఉందంటే.. అది జక్కన్న తీర్చిదిద్దిన బాహుబలి మాత్రమే. సంచలన విజయమే కాదు.. మర్చిపోలేని భారీ కలెక్షన్లను కొల్లగొట్టిన ఈ సినిమా విడుదలై రెండేళ్లు దాటినా.. ఇప్పటికీ ఈ సినిమా హాట్ టాపిక్కే. మరికొద్ది వారాల్లో బాహుబలి రెండో పార్ట్ రిలీజ్ కానుంది. అప్పుడెప్పుడో వచ్చిన బాహుబలిలోని క్యారెక్టర్ ను తనకు అపాదించుకున్న మోడీ తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. సంచలనంగా మారాయి.
అయిదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేస్తున్న ప్రధాని మోడీ.. తాజాగా యూపీలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బాహుబలి చిత్రాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి చిత్రంలో మహిష్మతి సామ్రాజ్యాన్ని కట్టప్ప ఎలా అయితే కాపాడుతాడో.. యూపీని బీజేపీ కంటికి రెప్పలా కాపాడుతుందని సాక్ష్యాత్తు ప్రధాని పేర్కొనటం గమనార్హం.
బాహుబలి చిత్రంలో రాజ్య సంరక్షణ కోసం కట్టప్ప ఎంతటి కమిట్ మెంట్ తో వ్యవహరిస్తాడో చూశారని.. యూపీ శాంతిభద్రతల విషయంలో బీజేపీ కూడా అదే తీరులో వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బీఎస్పీ అధినేత్రి మాయావతిపై తీవ్రంగా విరుచుకుపడటమే కాదు.. గుండాలకు ఆమె టికెట్లు ఇచ్చారంటూ అగ్గి ఫైర్ అయ్యారు. యూపీలో తమ విజయం డిసైడ్ అయిన నేపథ్యంలో.. సమాజ్ వాదీ.. బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు కొత్త ఎత్తులకు తెర తీశాయన్న ప్రధాని.. తాము ఓడిపోయినా ఫర్లేదు కానీ.. మెజార్టీ మాత్రం తమకు దక్కకూడదన్న ఆలోచనతో వ్యవహరిస్తున్నట్లుగా మోడీ ఆరోపించటం గమనార్హం.
కట్టప్ప మాదిరి యూపీ రక్షణ కోసం తాను అండగా నిలుస్తానని చెప్పిన ఆయన.. సినిమాలో మాదిరే.. ‘‘బాహుబలి’’ని చంపేస్తానని చెప్పటం విశేషంగా చెప్పాలి. ఎందుకంటే.. సినిమాలో బాహుబలి క్యారెక్టర్ చాలా మంచిది. మరి.. అలాంటి క్యారెక్టర్ ను కట్టప్ప లాంటోడు ఎందుకు చంపేశాడన్నది ఇప్పటికి రివీల్ కాలేదు. సినిమా ప్రస్తావన ప్రజల్ని ఆకట్టుకునేలా ప్రసంగించిన మోడీ.. బాహుబలి ప్రస్తావనను తనకు అనుకూలంగా మార్చేసుకోవటం గమనార్హం.
అయితేగియితే మోడీలాంటోడు బాహుబలిగా ఉండాలే కానీ.. కట్టప్పలా ఉండాలనుకోవటం ఏంటి చెప్మా? అన్న సందేహం రావటం ఖాయం. ఆ విషయం మీద ఫోకస్ చేస్తే ఆసక్తికర అంశం తెరపైకి వస్తుంది. యూపీలోఅవినీతిపరుల్ని బాహుబలిగా వ్యవహరిస్తారట. అందుకేనేమో మోడీ.. బాహుబలి చిత్రాన్ని ప్రస్తావించి కట్టప్పలా యూపీకి రక్షకుడిగా తాను వ్యవహరిస్తానని.. ‘బాహుబలి’ని చంపేస్తానని వ్యాఖ్యానించారు. మార్చి 11న అవినీతి పరుల్ని(బాహుబలుల్ని) కట్టప్ప ఎలా అయితే చంపేస్తాడో.. తాము అదే తీరులో అవినీతిపరుల్ని అంతమొందిస్తామని చెప్పటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యూపీకి మోడీ మాటలు సరిపోతాయేమో కానీ.. మిగిలిన వారికి మాత్రం మోడీ.. కట్టప్ప మాదిరి ఉండుడేంది? అన్న సందేహం కలగకమానదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/