Begin typing your search above and press return to search.
మరో ఇద్దరు సీనియర్లకు సున్నం పెట్టిన మోడీ-షాలు
By: Tupaki Desk | 17 Aug 2022 2:30 PM GMT70 ఏళ్లు దాటిన వారందరినీ ఇంటికి పంపించే ఒక పాలసీని పెట్టుకున్న మోడీ షాలు. అందుకే అద్వానీ, జోషి నుంచి మొదలుపెడితే వెంకయ్య, రవిశంకర్, జవదేకర్ ల వరకూ అందరినీ బీజేపీ నుంచి సాగనంపారు. ఎంతో యాక్టివ్ పాలిటిక్స్ చేసే వారిని కూడా ఇంటికి పంపారు. ఇప్పుడు వారు పార్టీలో లేరు. పదవుల్లో లేరు. బీజేపీలో మోడీషాల ఆధిపత్యానికి ఇది మచ్చుతునక. కానీ ఎవరూ గట్టిగా అడిగే వారే లేరు.
ఇప్పటికే మోడీ మొదటి కేబినెట్ లోని చాలా మందిని సాగనంపగా.. రెబల్ నేత అయిన గడ్కరీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ జోలికి పోలేదు. ఎందుకంటే వీరికి బీజేపీలో.. ప్రజల్లో మంచి ప్రజాదరణ ఫెయిత్ ఉంది. అందుకే వీరిని ముట్టుకోవడానికి మోడీ షాలు వెనుకాడారు. కానీ ఇప్పుడు వీరికి కూడా సున్నం పెట్టారు. బీజేపీలోని అన్ని నిర్ణయాలు తీసుకునే అత్యున్నత పార్లమెంటరీ బోర్డు నుంచి తాజాగా నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ లను తీసేసి బీజేపీలో ఓ సంచలనానికి దారితీశారు.
బీజేపీలో మరో ఇద్దరు సీనియర్లకు మోడీ షాలు పొగబెట్టారు. నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ లను బీజేపీ అత్యున్నత కమిటీ అయిన పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించారు. ఇక పార్లమెంటరీ బోర్డులో మిగిలిన సీనియర్ ఒకే ఒక్కరు. ఆయనే రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఎక్కడ తమకు పోటీగా వస్తారో? పార్టీలో ఎదుగుతారో అని వ్యూహాత్మకంగా బీజేపీలో సీనియర్లందరినీ సాగనంపే కార్యక్రమాన్ని మోడీ షాలు చాలా పకడ్బందీగా చేస్తున్నారు.ఇటీవలే వెంకయ్యనాయుడుకు కూడా రెన్యూవల్ ఇవ్వకుండా రిటైర్ మెంట్ ప్రకటించేశారు.ఇప్పుడు మరో ఇద్దరినీ అలాగే పంపించేశారు.
పార్లమెంటరీ కమిటీలో రాజ్ నాథ్ సింగ్ తప్ప ఇప్పుడు బీజేపీ ఏ ఒక్క సీనియర్ లేడు. అమిత్ షా, మోడీ,జేపీ నడ్డా లు కీలకంగా ఉన్నారు. మిగతా వారంతా వీరికి తలూపేవారే. మన తెలంగాణ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కు ఈ బోర్డులో స్థానం కల్పించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
నెక్ట్స్ రాజ్ నాథ్ సింగ్ మాత్రమే సీనియర్లలో ఉన్నారు. ఆయనను కూడా వచ్చేసారి సాగనంపడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో బీజేపీలో ఇక మోడీ షాలకు ఎదురునిలిచే నేతలే ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు.
బీజేపీలో 75 ఏళ్లు దాటిన వారికి చోటు లేదని ఒక నియమం పెట్టారు. అయితే ఆ నిబంధన మోడీ, అమిత్ షాకు వర్తించదని చెబుతున్నారు. మిగతా నేతలందరికీ వయసు తేడా చూపి పక్కకు తప్పించినా ఈ ఇద్దరు మాత్రం ఎల్లకాలం పార్టీ, పదవుల్లో ఉండేలా చూసుకుంటున్నారు.
బీజేపీలో మోడీ ప్రధాని అయ్యాక వ్యూహాత్మకంగా అద్వానీ నుంచి ఇప్పటికీ గడ్కరీ వరకూ అందరినీ సైలెంట్ గా పక్కకు తప్పిస్తున్నారు. రిటైర్ మెంట్ ఇచ్చేస్తున్నారు. యడ్యూరప్ప, సోనోవాలాలను సీఎం పదవుల్లోంచి తీసేశారు. శివరాజ్ సింగ్ ను కూడా వచ్చేసారి తప్పించడం ఖాయమంటున్నారు. ఇప్పుడు గడ్కరీ, చౌహాన్ లు వచ్చేసారి పార్టీలో, కేంద్ర కేబినెట్ లో కూడా ఉండరని సంకేతాలు పంపారు. ఇలా తమకు ఎదురునిలిచే.. పోటీవచ్చే వారిని సైలెంట్ గా తప్పిస్తూ మోడీషాలు ఈ బీజేపీ సామంతరాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించేందుకు రెడీ అవుతున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.