Begin typing your search above and press return to search.

అమరావతికి ఢిల్లీని తెచ్చాను

By:  Tupaki Desk   |   22 Oct 2015 8:49 AM GMT
అమరావతికి ఢిల్లీని తెచ్చాను
X
అమరావతి శంకు స్థాపన కార్యక్రమంలో మాట్లాడిన మోడీ కాస్త సెంటిమెంటునూ రంగరించారు. ఢిల్లీ నుంచి తాను తెచ్చిన పార్లమెంటు మట్టి, యమునా నది నీటిని కేవలం మట్టి, నీరుగానే చూడరాదని.. ఆ రెండిటిని తాను తేవడంతో దేశ రాజధాని ఢిల్లీ ఏపీ రాజధాని అమరావతి వద్దకు వచ్చినట్లయిందని చెప్పి ఆకట్టుకున్నారు. ‘‘అభివృద్ధి చెందుతున్న నగరాలకు అమరావతి సైతం ఓ దిక్సూచిగా ఉండాలని ఆశిస్తున్నాను. ఆవిధంగా నిర్మాణం జరుగుతుందన్నారు. జపాన్‌ మంత్రి కొత్త రాజధాని నిర్మాణంలో చాలా సవాళ్లు ఎదురవుతాయని తెలిపారు. నా జీవితంలోసైతం పలు సవాళ్లు,అనుభవాలు ఎదురయ్యాయి.గుజరాత్‌లో భూ ప్రకంపనాలు వచ్చాయి. ఒక రాజకీయ దృడ సంకల్పం,ప్రజాబలం దేన్నయినా సాధించవచ్చునన్నారు. రాజకీయ కారణాలతో, తొందరపాటుతో సరైన అవగాహన లేక రాస్ట్రాన్ని విడగొట్టారు. ఈ సందర్బంగా చాలామంది ప్రాణాలు కొల్పోయారు. అవన్నీ నన్ను కలిచివేశాయి. ఇంగ్లీషువాళ్లు వెళ్లిపోతూ కొన్నింటిని వదిలిపెట్టి వెళ్లారని,వాటిని కొందరు తమకు అనుకూలంగా తీసుకున్నారని మోడీ అన్నారు. ఆంధ్రా, తెలంగాణలోని తెలుగువారంతా ఒక్కటేనని మోడి తెలిపారు. రెండు రాష్ట్రాలు శక్తివంతంగా అభివృద్ధిచెందాలి’’ అని మోడీ ఆకాంక్షించారు.

ఆనాడు వాజ్‌పేయి హయాంలో ఎలాంటి విబేధాలు, విద్వేషాలు లేకుండా మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆంధ్రా, తెలంగాణ సైతం అలానే పనిచేస్తాయని , కలిసికట్టుగా పనిచేయాలని కోరుతున్నట్లు మోడీ తెలిపారు. ఆ రెండింటికి కావాల్సిన సహాయ సహకారాలు కేంద్రం అందిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయనను ఆహ్వానించారని తెలియగానే ఎంతో సంతోషించాను. అడ్డగోలుగా జరిగిన విభజన వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజల మధ్య ద్వేష భావం నెలకొనడం పట్ల ఎంతో ఆందోళన చెందాను. గత ప్రభుత్వం పోతూ పోతూ సమస్యను సంక్లిష్టం చేసి పోయిందన్నారు. అందువల్లనే అప్పుడప్పుడు సమస్యలు వస్తున్నాయన్నారు. రాష్ట్రాలు వేరైనా తెలుగు వారి ఆత్మ ఒక్కటే. రెండు రాష్ట్రాలూ కలిసి పని చేస్తే అభివృద్ధి పాదాక్రాంతం అవుతుందని మోడీ అన్నారు.