Begin typing your search above and press return to search.

దేశ ప్రజలతో మోడీ..ఏం చెప్పారంటే?

By:  Tupaki Desk   |   30 Jun 2020 11:15 AM GMT
దేశ ప్రజలతో మోడీ..ఏం చెప్పారంటే?
X
మనం అన్ లాక్ 2.0లోకి ఎంటర్ అయ్యామని.. సర్పంచ్ నుంచి ప్రధాని వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని.. నిబంధనలు పాటించాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. నిర్లక్ష్యం ఉండడం వల్ల సమస్యలు వస్తాయని.. నిబంధనలు అందరూ పాటించాల్సిందేనని మోడీ అన్నారు. ఈ సాయంత్రం ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో కరోనా వైరస్ నియంత్రణలోనే ఉందని పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. సరైన సమయంలో లాక్ డౌన్ విధించి ప్రజల ప్రాణాలు రక్షించాలన్నారు.

కరోనాతో ప్రపంచవ్యాప్తంగా మరణాలు ఎక్కువగా సంభవించాయని.. భారత్ లో మాత్రం మరణాల రేటు చాలా తగ్గించామని మోడీ అన్నారు. ఇది భారత్ ఘనత అని తెలిపారు. అంతేకాకుండా పేద ప్రజలకు మూడు నెలలు రేషన్ ఉచితంగా ఇచ్చి వారిని కాపాడుకున్నామన్నారు. పేదల ఖాతాల్లో జన్ ధన్ ఖాతాల్లో 35వేల కోట్ల డబ్బులు వేసి ఆర్థిక భరోసా కల్పించామన్నారు.దేశమంతా వన్ నేషన్.. వన్ రేషన్ తేచ్చామని.. ఈ కష్టకాలంలో ప్రజలు ఆకలితో అలమటించకుండా చేశామన్నారు.

నవంబర్ చివరి నాటికి గరీబ్ కళ్యాణ్ యోజన పొడిగిస్తున్నామని.. దీనికి 1.50లక్షల కోట్లు కేటాయించామని.. దీపావళి పండుగ వరకు ప్రజలంతా పండుగ ఘనంగా చేసుకునేలా ఈ ఐదు నెలల్లో కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ అన్నారు. వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రైతులు, ట్యాక్స్ పేయర్స్ కు ఊరటనిచ్చామని.. సడలింపులతో వారికి ప్రయోజనం చేకూర్చామని ప్రధాని మోడీ అన్నారు. స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించామని మోడీ అన్నారు.

దేశంలో సరైన సమయంలో లాక్ డౌన్ తోపాటు ఇతర నిర్ణయాలు తీసుకొని లక్షలాది ప్రాణాలను కాపాడామని ప్రధాని మోడీ అన్నారు. ఇప్పుడు అన్ లాక్ 2.0లో ప్రవేశించామన్నారు. ఇది వర్షా కాలమని.. ప్రస్తుతం జలుబు, జ్వరం వంటి రకరకాల వ్యాధులు చుట్టుముడుతాయని మోడీ అన్నారు.ఈ సమయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

కంటైన్మెంట్ జోన్లపై దృష్టి పెట్టాలని.. నిబంధనలు పాటించని వారు తీరు మార్చుకోవాలని మోడీ సూచించారు. వారికి జరిమానా విధించాలని.. మాస్క్ లేకుండా బయటకు వస్తే ఒక దేశ ప్రధానికే రూ.13వేలు జరిమానా విధించారని మోడీ అన్నారు. అలా దేశంలో కూడా నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్నారు. దేశంలో ఏ ఒక్కరూ చట్టానికి అతీతులు కారని మోడీ అన్నారు.

ఇక అన్ లాక్ 2.0లో దేశమంతా అప్రమత్రంగా ఉండి కరోనాను నియంత్రించాలని మోడీ పిలుపునిచ్చారు.