Begin typing your search above and press return to search.
పాక్ మీద మనోళ్ల దూకుడు చూశారా?
By: Tupaki Desk | 16 Aug 2016 5:30 PM GMTఅలవాటైన ఆట చాలా తేలిక. అందులోకి తొండి ఆట ఆడేవారికి ఆటలో నైపుణ్యం ఉండాల్సిన అవసరం ఉండదు. తొండాటకు అలవాటు పడినోడితో ఆట ఆడటం కూడా ఏ మాత్రం మంచిది కాదు. కానీ.. గడిచిన నలభై.. యాభై ఏళ్లలో భారత.. పాకిస్థాన్ ల మధ్య కాశ్మీర్ అంశం మీద మాటలు ఎలా ఉంటాయో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. పెద్దమనిషినన్న కోటు ఒకటి మీదేసుకొని.. పెద్దరికంగా వ్యవహరిస్తూ.. తొండాట ఆడే దాయాదికి చేసే తప్పు స్పష్టంగా చెప్పక పోవటం భారత పాలకులు ఇంతకాలం చేసింది. పాక్ విషయంలో ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా వ్యవహరిస్తూ.. మొండి పాకిస్థాన్ ను చెడ్డదన్న ముద్ర వేస్తే సరిపోతుందన్న భావనతో గత పాలకులు ఉండేవారు.
కానీ.. మోడీ అందుకు భిన్నమైన ఆట మొదలెట్టారు. తొండాట ఆడే పాక్ తో ఆట తనదైన శైలిలో ఎలా ఆడతానన్న విషయాన్ని శాంపిల్ గా చెప్పి చూపిస్తున్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా యుద్ధంలో గెలిచినోడు ఓడిపోవటం అనే కాన్సెప్ట్ భారత పాలకుల్ని చూస్తేనే తెలుస్తోంది. గత ప్రభుత్వాల ‘పెద్దరికం’ పోకడల పుణ్యమా అని పాక్ తో జరిగిన మూడు యుద్ధాల్లో గెలిచి కూడా.. ఆ దుష్ట దేశం ఆక్రమించుకున్న ఆక్రమిత కశ్మీర్ ను సొంతం చేసుకోకపోవటం ఏమిటో అర్థం కాదు. అంతర్జాతీయ సమాజం అనే బూచిని చూపించటం.. దాని దగ్గర బారత్ చెడ్డ కాకూడదన్న ఒక్క కారణం చూపించి.. కశ్మీర్ ఇష్యూను దశాబ్దాల తరబడి సాగదీస్తున్న పాలకులకు భిన్నంగా సరైన మొనగాడు లాంటి భారత ప్రధాని కుర్చీలో కూర్చున్నారని చెప్పాలి.
మొండోడితో చర్చలు జరిపితే ఫలితం ఎలా వస్తుందన్న విషయం తెలిసినా.. చర్చల మీద చర్చలు జరిగే తీరుకు భిన్నంగా కశ్మీర్ విషయంలో మోడీ పావులు కదుపుతున్నారని చెప్పాలి. కశ్మీర్ గురించి తరచూ ఇబ్బంది పెట్టే పాక్ కు.. పాక్ కు ఒళ్లు మండిపోయే పాక్ ఆక్రమిత కాశ్మీర్.. బలూచిస్థాన్ ఇష్యూల్ని తెర మీదకు తీసుకురావటమే కాదు.. అక్కడ పోరాడుతున్న వారికి భారత మద్ధతు ఉంటుందన్న విషయాన్ని క్లియర్ కట్ గా ఎర్రకోట సాక్షిగా మోడీ చెప్పేయటం పాక్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితిగా చెప్పాలి.
మోడీ లాంటి దూకుడు నాయకుడు పాక్ పాలకులకు కాస్త కొత్తే. గత పాలకుల మాదిరే మోడీ వ్యవహరించే అవకాశం ఉందని భావించి.. అదే తీరులో ఆట ఆడుతున్న దానికి తాజాగా పాక్ తనను తాను తిట్టుకోవాల్సి ఉంటుందేమో. కశ్మీర్ లో కలకలం రేపి.. ఆ మంటలతో చలి కాచుకుంటున్న పాక్ కు కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్న రీతిలో గిల్గిత్.. బలూచిస్థాన్ కు ఫుల్ సపోర్ట్ ఇవ్వటం ద్వారా ఇప్పుడు అక్కడ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అక్కడ మానవ హక్కుల హననం జరుగుతుందన్న మోడీ మాటలతో అక్కడ ఆందోళనలు రాజుకున్నాయి. పాక్ కు వ్యతిరేకంగా ఇంతకాలం ఉన్నఅసంతృప్తి ఇప్పుడు ఒక్కసారిగా ఎగిసిపడుతోంది.
ఎర్రకోట నుంచి మోడీ చేసిన వ్యాఖ్యలకు ఫలితం అన్నట్లుగా గిల్గిత్ లో చేస్తున్న ఆందోళనలు మరింత పెరగటంతో పాటు.. పాకిస్థాన్ నుంచి తమకు విముక్తి కావాల్సిందేనంటూ గిల్గిత్ అవామీ యాక్షన్ కమిటీ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఇదంతా కూడా మోడీ సపోర్ట్ చూసుకునే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పటివరకూ కశ్మీర్ ఇష్యూను కెలికిన ప్రతిసారీ పాక్ తో ఏదో ఒక ఒత్తిడితో తాత్కాలిక పరిష్కారంతో సంతృప్తి చెందే నాయకత్వానికి భిన్నంగా.. నువ్వు కశ్మీర్ ఇష్యూలో వేలెడితే.. నేను పాక్ అక్రమిత కశ్మీర్.. గిల్గిత్.. బలూచిస్థాన్ ఇష్యూలో కాలు పెట్టేస్తానన్న విషయాన్ని మోడీ తన చేతలతో చేసి చూపించటం పాక్ మైండ్ ను బ్లాక్ చేసే యవ్వారమనే చెప్పక తప్పదు. ఈ దూకుడు రానున్న రోజుల్లో ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.