Begin typing your search above and press return to search.

మోడీ... టార్గెట్ 9.. ఇంత ప‌ట్టుద‌ల వెనుక‌!

By:  Tupaki Desk   |   17 Jan 2023 5:32 AM GMT
మోడీ... టార్గెట్ 9.. ఇంత ప‌ట్టుద‌ల వెనుక‌!
X
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను టార్గెట్ చేసుకుంది. ఎట్టి ప‌రిస్థితిలో నూ హ్యాట్రిక్ కొట్టి రికార్డు సృష్టించాల‌నే సంక‌ల్పంతో ముందుకు సాగుతోంది. గ‌తంలో వాజ‌పేయి ఫొటోతో దేశంలో ఒక స్థాయి రికార్డును అందుకున్న బీజేపీ.. ఇప్పుడు మోడీ ఫేస్‌తో దేశాన్ని మూడో సారి ఏలాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలోనే అనూహ్య‌మైన మ‌రో మైలురాయిని ల‌క్ష్యంగా నిర్దేశించుకోవ‌డం గ‌మ‌నార్హం.

అదే.. తెలంగాణ స‌హా 9 రాష్ట్రాల‌ను గెలుచుకుని.. పాగా వేయాల‌నేది ల‌క్ష్యం. అంతేకాదు.. ఆయా రాష్ట్రా ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఓడిపోకూడ‌ద‌నేది క‌మ‌ల నాథుల తాజా లక్ష్యంగా ఉంది. నేరుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీనే ల‌క్ష్యం నిర్దేశించ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ‌, క‌ర్ణాట‌కల్లో అయితే.. ఈ వ్యూహానికి మరింత ప‌దును పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. క‌ర్ణాట‌క‌లో ఉన్న అధికారాన్ని నిల‌బెట్టుకోవాల‌నే ది ప్ర‌ధాన వ్యూహంగా ఉంది.

ఇక‌, తెలంగాణ‌లో ఖ‌చ్చితంగా విజ‌యం సాధించేదిశ‌గా అడుగులు వేయాల‌ని చూస్తున్నారు. ఇక‌, మిగిలిన రాష్ట్రాల్లో చిన్న‌వి ఉన్నాయి. త్రిపురలో మ‌రోసారి ఆధిక్యం ద‌క్కించుకుని విజ‌యం సాధించాల‌ని భావిస్తున్నారు.

అయితే.. నిజానికిఅన్ని పార్టీలూ ఎన్నిక‌ల ల‌క్ష్యం నిర్దేశించుకోవ‌డం కామ‌నే అయినా.. ఇప్పుడు బీజేపీ అనుస‌రిస్తున్న ధోర‌ణిని చూస్తే.. రాబోయే రోజుల్లో ఎలాంటి రాజ‌కీయాలు తెర‌మీద‌కి వ‌స్తాయో అనే భావ‌న క‌లుగుతోంది.

ఉదాహ‌ర‌ణకు తెలంగాణ‌ను తీసుకుంటే.. క్షేత్ర‌స్థాయిలో బీజేపీకి ప‌ట్టున్న ప్రాంతాలు కేవ‌లం న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలే. గ్రామీణ ప్రాంతంలో ఇప్ప‌టికీ బీఆర్ ఎస్ ఆధిప‌త్యం ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఇలాంటి రాష్ట్రంలోనూ అధికారంలోకి రావాల‌ని కంక‌ణం క‌ట్టుకొన్నారంటే.. ఏదో జ‌ర‌గ‌బోతోంద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

నిజానికి మోడీ కేంద్రంలో కొలువుదీరిన త‌ర్వాత‌.. త‌మకు మెజారిటీ రాకున్న‌ప్ప‌టికీ.. అధికారంలోకి వ‌చ్చిన మ‌హారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీ దూకుడు ఏంట‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.