Begin typing your search above and press return to search.
కుటుంబ పాలన అంటూ కేసీఆర్ ను టార్గెట్ చేసిన మోడీ.. ఏమన్నారంటే?
By: Tupaki Desk | 26 May 2022 9:30 AM GMTఎన్నో అనుమానాలు.. మరెన్నో సంశయాల నడుమ మొదలైన ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన.. అధికారికంగా వెల్లడించకున్నా బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద తనకు చూసేందుకు వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టులో దిగిన ఆయన.. బీజేపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో షురూ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ కుటుంబ పాలనలో బందీ అయ్యిందంటూ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల్ని సంధించారు.
వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నమ్మకాలకు.. సెంటిమెంట్లకు పెద్ద పీట వేసే సీఎం కేసీఆర్ ను పరోక్షంగాటార్గెట్ చేసిన ఆయన.. తాను అలాంటి మూఢనమ్మకాల్ని బ్రేక్ చేస్తానని చెబుతూ.. దానికి సంబంధించిన ఉదాహరణను ప్రస్తావించటం గమనార్హం.
ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే..
- కుటుంబ పాలన.. కుటుంబ పార్టీలు దేశానికి చేటు. తెలంగాణలో కుటుంబ పాలన అంతా అవినీతిమయంగా మారింది. తెలంగాణ భవిష్యత్తు కోసం మేం పోరాటం చేస్తున్నాం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.
- తెలంగాణలో అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యం. తెలంగాణలో మార్పు తథ్యం. ప్రజలు ఈ విషయంపై ఇప్పటికే స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లోనే ప్రజలు ఈ విషయంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
- యువతతో కలిసి ఉన్నత శిఖరాలకు తెలంగాణను తీసుకెళతాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేకమంది ప్రాణాలు ఆర్పించుకుననారు. ఒక్క కుటుంబం కోసం తెలంగాణలో అమరులు కాలేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది అమరులయ్యారు. వారందరికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. వారి ఆశయాలు నెరవేర్చాలి. భారతదేశ ఐక్యత కోసం సర్దార్ పటేల్ ఎంతో క్రషి చేశారు. ఒక ఆశయం కోసం వేలాది మంది ప్రాణ త్యాగాలు చేశారు.
- తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరులతో పాటు ఎవరి ఆశయాలు కూడా నెరవేరటం లేదు. కుటుంబ పాలనలో తెలంగాణ బంధీ అయ్యింది. కేవలం ఒక కుటుంబం కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరగలేదు. కుటుంబ పార్టీల్ని తరిమితేనే రాష్ట్రం.. దేశం డెవలప్ అవుతుంది.
- తెలంగాణ ప్రజలు ఎంత సమర్థులో నాకు తెలుసు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోంది. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా దూసుకెళుతున్నాం. ఈ ఎనిమిదేళ్లలో వేల స్టార్టప్ లను ప్రోత్సహించాం.
- కేంద్ర పరభుత్వ పథకాల్ని మార్చి తెలంగాణలో అమలు చేస్తున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలు తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన అవసరం ఉంది. ఇక్కడి రాజకీయాల వల్ల పేదలకు దక్కట్లేదు. పథకాల్లో రాజకీయం చేస్తే పేదలు నష్టపోతారు.
- తెలంగాణ ప్రజల అభిమానమే నా బలం. మీ ప్రేమే నా బలం. మీ అభిమానం.. అప్యాయతలకు కట్టుబడి ఉన్నా. దేశ సమగ్రత మన చేతుల్లోనే ఉంది. బీజేపీకి చెందిన ఒక్కో కార్యకర్త సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాల కోసం పోరాటం చేస్తారు.
- తెలంగాణను టెక్నాలజీ హబ్ గా మార్చాలనుకుంటే కొందరు కుటుంబ పాలనతో బందీ చేయాలనుకుంటున్నారు.
- బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడుల అంశం నా దృష్టికి వచ్చింది. దాడుల్లో మరణించిన బీజేపీ కార్యకర్తలకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నా.
- పట్టుదలకు.. పౌరుషానికి తెలంగాణ ప్రజలు మారుపేరు. 21వ శతాబ్దంలోనూ కొందరు మూఢ నమ్మకాల్ని పాటిస్తున్నారు. అలాంటివాళ్లు తెలంగాణకు న్యాయం చేయలేరు. ముఢ నమ్మకాలు ఉన్న వ్యక్తులు తెలంగాణను ముందుకు తీసుకెళ్లలేరు. గుజరాత్ లోని ఒక ప్రాంతానికి వెళితే అధికారం పోతుందని ప్రచారం జరిగేది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి పదే పదే వెళ్లేవాడిని. మూఢ నమ్మకాలు తెలంగాణ డెవలప్ మెంట్ కు అడ్డంకిగా మారాయి.