Begin typing your search above and press return to search.
ముగ్గురు సీఎం సీట్లకు ఎసరు పెడ్తున్న మోడీ
By: Tupaki Desk | 15 March 2017 5:26 PM GMTఉత్తరప్రదేశ్ లో అనూహ్యరీతిలో బంపర్ మెజార్టీ సాధించేందుకు కారణమైన బీజేపీ రథసారథి - ప్రదానమంత్రి నరేంద్ర మోడీ తన దూకుడును మరింత పెంచుతున్నారు. ఆయా రాష్ర్టాల్లో తన పట్టు పెంచుకునే క్రమంలో భాగంగా గోవా - మణిపూర్ సీఎం పీఠాలను బీజేపీ ఖాతాలో పడేలా చక్రం తిప్పి మోడీజీ....కేంద్ర రక్షణ మంత్రిగా క్లీన్ ఇమేజ్ ఉన్న మనోహర్ పరికర్ ను సీఎంగా పంపించిన సంగతి తెలిసిందే. ఇదే తరహా ఆపరేషన్ ను మరింత వేగంగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ఈ సారి రివర్స్ ఆపరేషన్ కు మోడీ సిద్ధమయ్యారట. ముగ్గురు సీఎంలను పదవి నుంచి తప్పించి వారికి కేంద్ర మంత్రులుగా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
సీఎం పదవి చేపట్టిన వారిలో మోడీతో సమకాలినులు అయిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ - రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియాతో పాటుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం పదవికి రాజీనామా చేయించాలని మోడీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు నేతలు తమ తమ రాష్ర్టాల్లో అద్భుతమైన పనితీరు కనబర్చడం మోడీకి తెగ నచ్చేసిందని సమాచారం అందుకే వారి సేవలను దేశవ్యాప్తంగా ఉపయోగించుకునే ప్రణాళికలో భాగంగా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది.
అయితే దీనిపై కొందరు భిన్నమైన వాదన చేస్తున్నారు. తనకు నచ్చిన వారిని సీఎంలుగా పెట్టుకునేందుకే ఈ ముగ్గురిని కేంద్ర మంత్రులుగా తీసుకువస్తున్నట్లుందని చెప్తున్నారు. ఈ ముగ్గురు సీఎంలను పదవి నుంచి తప్పించే ప్రక్రియ ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/