Begin typing your search above and press return to search.

సీఎం జగన్ లేఖను మోడీ చెత్తబుట్టలో వేస్తాడు

By:  Tupaki Desk   |   8 Feb 2021 4:15 PM GMT
సీఎం జగన్ లేఖను మోడీ చెత్తబుట్టలో వేస్తాడు
X
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాజమండ్రి మాజీ ఎంపీ అరుణ్ కుమార్ స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం జగన్ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించవద్దని రాసిన లేఖ వృథా అని.. ఆ లేఖను మోడీ చెత్త బుట్టలో వేస్తాడని అరుణ్ కుమార్ ఎద్దేవా చేశారు.

ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలంటూ ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాయడం వల్ల ఉపయోగం లేదని ఉండవల్లి కుండబద్దలు కొట్టారు. ఆ లేఖను తీసి చెత్త బుట్టలో మోడీ వేస్తాడని కుండబద్దలు కొట్టారు. సీఎం జగన్ రాసిన లేఖలో మొదటి లైనే తనను ఆశ్చర్యపరిచిందని ఉండవల్లి అన్నారు.వైసీపీ ఎంపీలంతా బడ్జెట్ బాగోలేదని పెదవి విరిస్తే.. సీఎం మాత్రం బడ్జెట్ చాలా బాగుందంటూ అభినందిస్తూ రాయడంలో ఆంతర్యం ఏంటో తెలియడం లేదని ఉండవల్లి అన్నారు.

స్టీల్ ప్లాంట్ గురించి క్లియర్ గా చెప్పాల్సింది పోయి.. బడ్జెట్ ప్రస్తావన తీసుకు వచ్చారని ఉండవల్లి అన్నారు. ఆ లేఖ వల్ల పెద్ద ప్రభావం ఉండదన్నారు. అన్ని పార్టీలు కలిసి చర్చించి గనులు సాధించాలన్నదే తక్షణ కర్తవ్యమన్నారు. దీనిపై చర్చించడానికి సోము వీర్రాజు , నాదెండ్ల, సీపీఐ మధు, సీపీఎం రామకృష్ణ వస్తా అన్నారని.. చంద్రబాబు, సీఎం జగన్ కార్యాలయాలకు ఫోన్ చేశానని తెలిపారు.అధికార, ప్రతిపక్షాల తీరు చూశాక ఇదంతా వృథా అనిపిస్తోందని ఉండవల్లి అన్నారు. స్టీల్ ప్లాంట్ ఇవ్వడం కరెక్ట్ కాదని.. ప్రజల సెంటిమెంట్ తో ముడిపడి ఇది ఉందని అన్నారు.