Begin typing your search above and press return to search.

మ‌రో సంచ‌ల‌నం దిశ‌గా మోడీ అడుగులు

By:  Tupaki Desk   |   2 Jun 2017 1:29 PM GMT
మ‌రో సంచ‌ల‌నం దిశ‌గా మోడీ అడుగులు
X
క‌ల‌లో కూడా ఊహించ‌ని నిర్ణ‌యాలు తీసుకోవ‌టం ప్ర‌ధాని మోడీకి అలవాటే. పెద్ద నోట్ల ర‌ద్దు మాట‌ను గ‌తంలో ఎవ‌రైనా చెబితే.. సాధ్య‌మేనా? అనేశారు. కానీ.. అలాంటి సాధ్యం కాని నిర్ణ‌యాల్ని సైతం సింఫుల్ గా సాధ్య‌మ‌య్యేలా చేయ‌టం మోడీకి మాత్ర‌మే సాధ్యం. త‌న నిర్ణ‌యాల‌తో అక్ర‌మార్కుల గుండెల్లో నిద్ర‌పోయేలా చేసిన ఆయ‌న‌.. ఏం చేసినా మోడీకి మాత్ర‌మే కుదురుతుంద‌న్నట్లుగా చేయ‌గ‌లిగారు.

పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన ఆయ‌న‌.. తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసి..అంత‌కంటే పెద్ద నోటును తెర మీద‌కు తీసుకొచ్చిన మోడీ.. ఇప్పుడా నోటుకు చ‌ర‌మ‌గీతం పాడాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన త‌ర్వాత విడుద‌ల చేసిన రూ.2వేల నోట్ల‌లోకి న‌ల్ల‌ధ‌నం భారీగా మారిన నేప‌థ్యంలో.. ఇప్పుడు కానీ ఆ నోటును ర‌ద్దు చేస్తే.. మొత్తంగా బ్లాక్ మ‌నీ రాయుళ్ల‌కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వ‌టంతో పాటు.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోకి పెద్ద మొత్తాన్ని తీసుకురావొచ్చ‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

అదే స‌మ‌యంలో ఇప్పుడు చెలామ‌ణిలో ఉన్న చిల్ల‌ర నాణాల‌కు కూడా నిలిపివేయాల‌ని అనుకుంటున్న‌ట్లుగా తెలుస్తోంది. ఎందుకిలా అంటే.. చిల్ల‌ర నాణెలను ప్రింట్ చేసేందుకు అయ్యే ఖ‌ర్చు ఎక్కువ‌గా ఉండ‌టం..వాటి విలువ కంటే ఎక్కువ ఉత్ప‌త్తి ఖ‌ర్చు అవుతుండ‌టంతో వాటిని నిలిపివేసి.. వాటిస్థానంలో నోట్ల‌ను తీసుకురావాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

రూ.10 నాణెన్ని త‌యారు చేయ‌టానికి రూ.6.10 ఖ‌ర్చు అవుతుంటే.. ప‌ది రూపాయిల నోట‌ను త‌యారు చేయ‌టానికి మాత్రం కేవ‌లం 94పైస‌లు మాత్ర‌మే ఖ‌ర్చు కావ‌టం గ‌మ‌నార్హం. ఈ లెక్క‌న ఇప్పుడు వినియోగంలో ఉన్న రూ.5.. రూ2.. రూ.1 నాణెల్ని ముద్రించ‌టానికి పెద్ద ఎత్తున ఖ‌ర్చు అవుతున్న నేప‌థ్యంలో ఆ భారాన్ని నోట్ల రూపంలో త‌గ్గించేందుకు వీలుగా చిల్ల‌ర నాణెల మీద నిషేధం విధించే వీలుంద‌న్న వాద‌న జోరుగా వినిపిస్తోంది.

ఇందుకు త‌గ్గ‌ట్లే అప్పుడెప్పుడో ప్రింటింగ్ ఆపేసిన రూపాయి నోటును తాజాగా తిరిగి తీసుకొస్తున్న నేప‌థ్యంలో చిల్ల‌ర నాణెల ముద్ర‌ణ‌ను నిలిపేసి.. ఆ స్థానంలో నోట్ల‌ను తీసుకొచ్చే ఆలోచ‌న ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. అయితే.. నోట్ల‌తో పోలిస్తే.. నాణెల మ‌నుగ‌డ ఎక్కువ కాలం ఉండ‌టంపైనా చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి.. దీనిపై మోడీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/