Begin typing your search above and press return to search.
కేసీఆర్ సలహాను మోడీ ఫాలో కానున్నారా?
By: Tupaki Desk | 8 April 2020 6:15 AM GMTవిపత్కర వేళలో ముప్పు నుంచి తప్పించుకోవటానికి ఉన్న ఏకైక మార్గం ముందుచూపే. ఆ విషయంలో తనకు మించినోళ్లు లేరన్న విషయాన్ని ఇప్పటికే పలుమార్లు నిరూపించుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. సోమవారం రాత్రి వేళ నిర్వహించిన మీడియా సమావేశంలో లాక్ డౌన్ ను పొడిగించటం తప్ప మరో మార్గం లేదని తేల్చేశారు సీఎం కేసీఆర్. దేశానికి ఉన్న పరిమితులను చూస్తే.. కరోనాను కంట్రోల్ చేయాలంటే లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదని స్పష్టం చేశారు.
తాను చేసిన సూచనను కేంద్రంలోని మోడీ సర్కారు పరిశీలించాలన్నారు. కేంద్రం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఈ నెల 14తో పూర్తి కానుంది. ఇందుకు మరో వారం మాత్రమే గడువు ఉన్న వేళ.. తెర మీదకు వచ్చిన కేసీఆర్ పొడిగింపు అంశాన్ని చర్చకు పెట్టారు. కేసీఆర్ వాదనకు దేశంలోని మెజార్టీ రాష్ట్రాలు ఓకే అన్నట్లుగా చెబుతున్నారు. కేంద్రం సైతం కేసీఆర్ మాటను ఫాలో కావాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో లాక్ డౌన్ ఎత్తివేసినా.. తాత్కాలికంగా సడలించినా.. పాక్షికంగా పక్కకు పెట్టినా జరిగే నష్టం భారీగా ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే.. మరికొన్ని రోజులు లాక్ డౌన్ ను పొడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. పొడిగింపుపై కేసీఆర్ సూచనకు తగ్గట్లే.. ప్రధాని మోడీ మాటలు ఉండటాన్ని మర్చిపోకూడదు. కరోనాపై దీర్ఘకాలిక పోరుకు సిద్దంగా ఉండాలని.. ఓడినట్లుగా భావించకూడదన్న మాట ఆయన నోటి నుంచి రావటం అంటే.. కచ్ఛితం గా లాక్ డౌన్ పొడిగింపు ఖాయమని చెప్పక తప్పదు.
నిత్యవసర వస్తువుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే.. మాల్స్.. మత ప్రార్థనలు జరిగే చోట్లకు ప్రజలు వెళ్లకుండా అడ్డుకోవాలని.. ఇందులో భాగంగా మే 15 వరకు వాటిని మూసి వేయటం మంచిదన్న ఆలోచన లో కేంద్రం ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే..లాక్ డౌన్ పొడిగింపు అంశాన్ని తెర మీదకు తెచ్చేందుకు.. కేంద్రం ఏమేం చేయాలనుకుంటున్న విషయాన్ని ప్రధానమంత్రి మోడీనే స్వయంగా జాతి జనులకు చెబుతారని.. త్వరలోనే ఆయన దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని చెబుతున్నారు. ఈ సందర్భం లోనే లాక్ డౌన్ పొడిగింపు అంశంపై క్లారిటీ ఇవ్వటం ఖాయమంటున్నారు. అదంతా ఓకే.. మరీసారి ఎలాంటి టాస్కు ఇస్తారో చూడాలి.