Begin typing your search above and press return to search.

జయలలితకు అంత సీరియస్ గా ఉందా..?

By:  Tupaki Desk   |   7 Aug 2015 11:52 AM GMT
జయలలితకు అంత సీరియస్ గా ఉందా..?
X
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితి ఆరోగ్యం మరోమారు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడతున్నారన్న విషయం శుక్రవారం నాటి పరిణామలతో తేటతెల్లమైంది. మద్రాసు విశ్వవిద్యాలయంలో జరిగిన 'జాతీయ చేనేత దినోత్సవం' కార్యక్రమానికి ఆమె గైర్హాజరు కావడంతో జయలలిత అభిమానులు,ఏఐఏడిఎంకె కార్యకర్తలలో అనేక సందేహాలు వస్తున్నాయి. 'జాతీయ చేనేత దినోత్సవం' కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని మోడీకి విమానాశ్రయంలో గవర్నర్ రోశయ్యతో కలసి జయలలిత ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత ఆమె తన ఇంటికి వెల్లిపోయారు... మోడీ పాల్గొన్న కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆమె తరఫున హాజరైన ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జయలలిత ప్రసంగ పాఠాన్ని చదివి వినిపించారు. ప్రధాని హాజరైన ఈ ప్రధానమైన కార్యక్రమానికి జయలలిత గైర్హజరవడంతో ఆమె ఆరోగ్యం ఇంకా ఏమాత్రం బాగులేన్న వాదనకు బలం చేకూరుస్తోంది. నిజానికి కేంద్రంతో జయలలిత సంబంధాలు బాగానే ఉన్నాయి... వ్యక్తిగతంగానూ మోడీతో వివాదమేమీ లేదు. ఈ నేపథ్యంలో ఆమె గైర్హాజరీకి రాజకీయ కారణాలేవీ లేవు.

మరోవైపు ప్రధాని మోడీ జయలలిత ఇంటికి వెళ్లడంతో ఆమెను పరామర్శించడానికే అయ్యుంటుందని అంతా భావిస్తున్నారు. గతంలోనూ పలుమార్లు జయతో మోడీ సమావేశమైనా ఇలా నేరుగా ఇంటికి వెళ్లడమనేది ఇంతవరకు లేదు. దీంతో ఆమె అనారోగ్యం గురించి తెలిసే ప్రధాని వెళ్లి పరామర్శించి ఉంటారని చెబుతున్నారు. జయ ఆరోగ్యంపై వివిధ రకాలుగా అనుకుంటున్నా ఎవరూ నోరు విప్పలేకపోతున్నారు. మొత్తానికి జయ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మాత్రం అక్కడి రాజకీయవర్గాలు చెబుతున్నాయి.