Begin typing your search above and press return to search.
మోడీ తర్వాతి స్కెచ్ ఇదే
By: Tupaki Desk | 12 March 2017 5:17 AM GMTఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తర్వాతి లక్ష్యాలపై అధికార బీజేపీ దృష్టి సారించింది. ఈ జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున పోటీచేసే అభ్యర్థిని గెలిపించుకోవడంపై ఇప్పుడు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ జూలై 25వ తేదీతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం పూర్తికానున్నందున ఆ లోపునే రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. ఎన్డీఏ తరఫున దళితుడిని అభ్యర్థిగా నిలబెట్టాలని బీజేపీ భావిస్తుందని సమాచారం. ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరమైనందున వారికి ఎలాంటి అభ్యంతరం లేకుండా దళిత వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టాలని యోచిస్తున్నట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.
మరోవైపు తాజా ఫలితాలు వచ్చే ఏడాది నుంచి రాజ్యసభలో బలాబలాల్లో మార్పులకు దారి తీస్తాయి. యూపీ గెలుపుతో వచ్చే ఏడాది ఖాళీ అవుతున్న పది స్థానాలను బీజేపీకి దక్కనున్నాయి. ఎగువసభలో సాధారణ మెజారిటీ కావాలంటే 123 మంది సభ్యుల బలం కావాలి. ప్రస్తుతం బీజేపీ - దాని మిత్రపక్షాల బలం 75 మంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో 68 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. వాటిలో పది స్థానాలు ఉత్తరప్రదేశ్ - ఉత్తరాఖండ్ రాష్ర్టాల పరిధిలోనివైతే.. మిగతా 58 స్థానాలు ఢిల్లీ - కేరళ - మధ్యప్రదేశ్ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక - బీహార్ - గుజరాత్ - తెలంగాణ - రాజస్థాన్ - ఒడిశా - జార్ఖండ్ - మహారాష్ట్ర - హర్యానా - సిక్కిం రాష్ర్టాల నుంచి భర్తీ అవుతాయి. తద్వారా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు మెజారిటీ పెరుగుతుంది. దీనికి తోడు నామినేటెడ్ సభ్యులు సచిన్ టెండూల్కర్ - రేఖ తదితరుల పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్ లో ముగుస్తుంది. తద్వారా మరో నలుగురు సభ్యులను రాష్ట్రపతి ఎగువసభకు నామినేట్ చేస్తారు. నామినేటెడ్ సభ్యులకు విప్ వర్తించకున్నా.. ఎగువసభలో నామినేటెడ్ సభ్యులు అధికార పక్షానికి మద్దతు పలుకుతారు. దీంతో బీజేపీకి భవిష్యత్ లో రాజ్యసభలో వివిధ బిల్లుల విషయంలో ఇబ్బందులు తలెత్తవని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/