Begin typing your search above and press return to search.

మోడీ టీంలో ఆ ఆరుగురు సేఫ్

By:  Tupaki Desk   |   15 Jan 2016 6:18 AM GMT
మోడీ టీంలో ఆ ఆరుగురు సేఫ్
X
కేంద్ర మంత్రివర్గ కూర్పును మార్చాలని ప్రధాని మోడీ తలపోస్తున్నారు. కొన్ని ప్రధాన శాఖలను టచ్ చేయకుండా మిగతా శాఖలో భారీగా మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేర్పుల ఉంటాయని భావిస్తున్నారు. ఆ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడానికి ముందే మంత్రివర్గంలో సమూల మార్పలకు తెరతీస్తారు.

కేబినెట్లో ప్రధాన శాఖలైన హోం, ఆర్థిక, రక్షన, విదేశీ వ్యవహారాల శాఖల జోలికి పోకుండా మిగతా శాఖలనే మారుస్తారు. కాబట్టి రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్, సుష్మాస్వరాజ్ మినహా మిగతావారందరిపైనా కత్తి వేలాడుతున్నట్లే. మిగతా వారిలో సురేష్ ప్రభుపైనా ప్రధానికి మంచి నమ్మకం ఉండడంతో ఆయన స్థానం కూడా పదిలమేనని తెలుస్తోంది. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును కూడా కదిపే అవకాశం లేదు. మిత్రపక్షం టీడీపీకి చెందిన ఆయన్ను అదే శాఖలో ఉంచుతారు. మిగతావారిలో కొందరికి ఉద్వాసన, శాఖల మార్పు తప్పదు. టీడీపీకి చెందిన మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్థానంలో టీడీపీ నుంచే వేరొకరికి అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మోడీ కూడా తన మంత్రుల పనితీరును సమీక్షించుకున్నప్పుడు టీడీపీ మంత్రుల్లో అశోక పట్ట సంతృప్తిగానే ఉన్నారని... సుజనా పనితీరు పట్ల మాత్రం ఆయన నమ్మకంగా లేరని సమాచారం.

ఈ లెక్కన నికరంగా రాజనాథ్, జైట్లీ, పారికర్, సుష్మ, సురేశ్ ప్రభు, అశోక్ గజపతిరాజుల మంత్రి పదవుల్లో ఎలాంటి తేడాలుండవని... మిగతావారి విషయంలో మార్పుచేర్పులుంటాయని తెలుస్తోంది. 2019లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలనూ దృష్టిలో ఉంచుకుని ఈ మార్పుచేర్పులు ఉంటాయి.