Begin typing your search above and press return to search.

యుద్ధం ఆపమని పుతిన్ కే చెప్పిన మోడీ.. రియాక్షన్ ఇదేన

By:  Tupaki Desk   |   17 Sep 2022 4:29 AM GMT
యుద్ధం ఆపమని పుతిన్ కే చెప్పిన మోడీ.. రియాక్షన్ ఇదేన
X
దేశానికి ప్రధానమంత్రులుగా వ్యవహరించిన చాలామందితో పోలిస్తే.. కొన్ని విషయాల్లో నరేంద్ర మోడీని మెచ్చుకోవాల్సిందే. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు మరే ప్రధానమంత్రి కూడా మరో దేశ ప్రధాని లేదంటే అధ్యక్షుల వారికి కీలక అంశంపై సూచన/సలహా ఇచ్చింది లేదు. మోడీ..ఆ పని కూడా చేశారు. రష్యా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పుతిన్ కు ఆయన కీలక సూచనలు చేశారు.

ఉక్రెయిన్ సంక్షోభాన్ని త్వరగా ముగించాలని.. ఇది యుద్ధాల కాలం కాదని చెప్పడం తో పాటు.. 'ఇవాళ ప్రపంచం ముందు.. ముఖ్యంగా వర్ధమాన దేశాల ఆందోళన అంతా ఆహారం.. ఇంధన భద్రత.. ఎరువుల గురించే. ఈ సమస్యలకు పరిష్కార మార్గాల్ని కనుగొనాలి. దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఇది యుద్ధాల కాలం కాదు. దీనిపై ఫోన్లో మనం పలుసార్లు మాట్లాడుకున్నాం' అని గుర్తు చేయటం విశేషం.

మోడీ మాటలకు పుతిన్ సానుకూలంగా స్పందించటం గమనార్హం. మోడీ చేసిన సూచనకు ప్రతిగా పుతిన్ రియాక్టు అవుతూ.. 'భారత ఆందోళనల గురించి తెలుసు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు అన్నీ చేస్తాం. చర్చల ప్రక్రియలో పాల్గొనేందుకు ఉక్రెయిన్ నిరాకరిస్తోంది.యుద్ధరంగంలో సైనికంగానే తన లక్ష్యాల్ని సాధించాలనుకుంటోంది' అని తెలిపినట్లు చెబుతున్నారు.

ఉక్రెయిన్ ఎపిసోడ్ షురూ అయ్యాక పుతిన్ తో నేరుగా నరేంద్ర మోడీ భేటీ కావటం ఇదే తొలిసారి. రష్యా అధ్యక్షుడిగా చర్చలు ముగిసిన తర్వాత మోడీ ట్వీట్ చేశారు. అందులో చర్చలు అద్భుతంగా జరిగాయని పేర్కొన్నారు.

రెండు దేశాల సంబంధాలు చాలా వేగంగా డెవలప్ చెందుతున్నాయని.. కీలక అంశాలపై అంతర్జాతీయ వేదికలపై కలిసి పని చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రపంచ గమనాన్ని మార్చేలాంటి ఈ సన్నివేశానికి ఉజ్బెకిస్థాన్ లోని చారిత్రక నగరం సమర్ఖండ్ వేదికైంది. షాంఘై సహకరా సంస్థ సదస్సు సందర్భంగా మోడీ.. పుతిన్ లు సమావేశమయ్యారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.