Begin typing your search above and press return to search.
ఇదేం పోలిక: ట్రంప్.. మోడీ లాంటోడేనట
By: Tupaki Desk | 20 July 2016 9:25 AM GMTతన మాటలతో ప్రపంచం మొత్తాన్ని దుమ్మెత్తి పోయించుకుంటున్న అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని మోడీతో పోల్చటం తగినదేనా? వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మాటలు చెప్పే మోడీకి.. మాటలతో మంట పుట్టించే ట్రంప్ కి సంబంధం లేకున్నా.. వారిద్దరి మధ్య చాలానే పోలికలు ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రిపబ్లికన్ పార్టీ నేత న్యూట్ గింగ్రిచ్. రిపబ్లికన్ హిందూ సమాఖ్యతో ఏర్పాటు చేసిన బ్రేక్ ఫాస్ట్ మీట్ లో పాల్గొన్న ఆయన.. భారత ప్రధాని మోడీ.. అమెరికా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ ట్రంప్ లు ఆయా దేశాల్లో ఉన్నత పదవులకు సహజ అర్హత ఉన్న వారిగా వ్యాఖ్యానించారు.
ఇద్దరికి అనేక పోలికలు ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. భారత్ కు మోడీ గొప్ప రక్షకుడిగా వ్యాఖ్యానించిన గింగ్రిచ్.. ట్రంప్ కూడా అలాంటి లక్షణమే ఉందని వ్యాఖ్యానించారు. భారత దేశ ప్రజలను మోడీ ఒకే తాటి మీదకు తీసుకొచ్చారని.. అలానే ట్రంప్ సైతం డీల్ మేకర్ గా అభివర్ణించారు. ఇద్దరిలో ఆత్మవిశ్వాసం ఎక్కువని.. అమెరికా అధ్యక్షుడిగా మారిన తర్వాత ఇద్దరు నేతలు కలిసి చర్చించుకోవాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ట్రంప్ కు అత్యంత సన్నిహితుడైన గింగ్రిచ్ మోడీ ప్రస్తావన తేవటం ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. మరో విషయం ఏమిటంటే.. ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేస్తున్న సమయం నుంచే పరిచయం ఉండటం గమనార్హం. ఏమైనా.. గింగ్రిచ్ వ్యాఖ్యలు ట్రంప్ ఇమేజ్ సంగతి తర్వాత.. మోడీ ఇమేజ్ ను ఇబ్బందుల్లో పడేసేలా ఉందనటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి.